Army Dog: కథన సీమలో కొదమ సింహం.. ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడిన ఆర్మీ జాగిలం కన్నుమూత..

|

Oct 13, 2022 | 4:55 PM

జమ్మూకాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా తంగ్ పావా ప్రాంతంలో ఈ నెల 10వ తేదీన భారత ఆర్మీ బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆర్మీకి చెందిన జూమ్ అనే జాగిలం తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.

Army Dog: కథన సీమలో కొదమ సింహం.. ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడిన ఆర్మీ జాగిలం కన్నుమూత..
Army Dog Zoom
Follow us on

కశ్మీర్‌లో ఉగ్రవాదులను ఎదుర్కోవడంలో ఎంతో ధైర్య సాహాసాలు ప్రదర్శించిన సైనిక శునకం జూమ్‌ కన్నుమూసింది. ఉగ్రవాదులున్న దాగి ఉన్న ప్రాంతంలో వారిని కనిపెట్టేందుకు ఈ శునకాన్ని సోమవారం నాడు సైన్యం పంపించింది. ఈ ఆపరేషన్‌లో జూమ్‌పై రెండు బుల్లెట్లు పేలాయి. అయినప్పటికీ అది బెదిరిపోకుండా జాడ కనిపెట్టడంతో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. ముఖంపైన, ముందు కాళ్లపై బుల్లెట్‌ తాకాయి. తీవ్రంగా గాయపడిన ఈ వీరశునకాన్ని శ్రీనగర్‌లోని వెటర్నరీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. నిన్న దానికి ఆపరేషన్‌ కూడా చేశారు. ఈ ఉదయం పదకొండున్నర వరకు అది కోలుకుంటున్నట్టుగానే కనిపించింది. కానీ అకస్మాత్తుగా కన్నుమూసిందని అధికారులు తెలిపారు.

జూమ్ ఉదయం 11:45 గంటల వరకు బాగానే ఉందని.. అకస్మాత్తుగా ఊపిరి కుప్పకూలి మరణించిందని ఆర్మీ అధికారులు తెలిపారు. జూమ్‌ ఆర్మీ వెట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిందని అధికారులు తెలిపారు. దక్షిణ కాశ్మీర్‌లో తీవ్రవాదులను నియంత్రించేందుకు జరిగిన అనేక క్రియాశీల కార్యకలాపాలలో జూమ్ పాల్గొందని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

జూమ్‌ త్వరగా కోలుకోవాలంటూ అంతకుముందు సైన్యంలోని చినార్‌ కార్ప్స్‌ ఒక వీడియో విడుదల చేసింది. అందులో దానికి అందించిన శిక్షణ, ఉగ్రవాదులను అది ముట్టుబెట్టిన తీరు కళ్లకు కట్టినట్టు చూపారు. మెలానాయిస్‌ లేదా బెల్జియన్‌ షెపర్డ్‌ అనే జాతికి చెందిన ఈ వీర శునకం సెప్టెంబర్‌ 2020లో పుట్టింది. దాదాపు ఎనిమిది నెలలుగా ఇది శ్రీనగర్‌లోని ఆర్మీ డాగ్‌ యూనిట్‌లో సేవలందిస్తోంది.

జమ్మూకాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా తంగ్ పావా ప్రాంతంలో ఈనెల 10వ తేదీన భారత ఆర్మీ బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు మరణించగా, పలువురు భారత జవాన్లు గాయపడ్డారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..