చాలా రోజులకు తన మిత్రుని వద్దకు వెళ్లిన ఆరిఫ్.. సంతోషం పట్టలేక కొంగ ఏం చేసిందంటే

మనకు ఇష్టమైన వాళ్లని ఎక్కువ రోజులు చూడకుండా ఉండకపోతే మనసు కలిచివేస్తుంది. ఏం చేయాలన్న తోచదు. ఒక్కసారిగా వాళ్లు మన దగ్గరికి వస్తే ఆ ఆనందానికి అవధులు ఉండవు. ఈ అనుభూతి కేవలం మనుషులకే కాదు. జంతువులకు కూడా వర్తిస్తుంది.

చాలా రోజులకు తన మిత్రుని వద్దకు వెళ్లిన ఆరిఫ్.. సంతోషం పట్టలేక కొంగ ఏం చేసిందంటే
Arif

Updated on: Jul 16, 2023 | 6:49 AM

మనకు ఇష్టమైన వాళ్లని ఎక్కువ రోజులు చూడకుండా ఉండకపోతే మనసు కలిచివేస్తుంది. ఏం చేయాలన్న తోచదు. ఒక్కసారిగా వాళ్లు మన దగ్గరికి వస్తే ఆ ఆనందానికి అవధులు ఉండవు. ఈ అనుభూతి కేవలం మనుషులకే కాదు. జంతువులకు కూడా వర్తిస్తుంది. గత ఏడాది ఉత్తరప్రదేశ్‌లోని అమేఠికి చెందిన ఆరిఫ్ అనే వ్యక్తి.. తీవ్రంగా గాయపడి ఉన్న కొంగను ప్రాణాలతో రక్షించాడు. ఈ విషయం అప్పట్లో బాగా వైరలయ్యింది. చాలమంది ఆరిఫ్ చేసిన సహాయానికి ప్రశంసల వర్షం కురిపించారు. ఆ కొంగ కూడా అరిఫ్‌ను వదిలి అస్సలు ఉండేది కాదు.

ఆరిఫ్ బైక్‌పై వెళ్లినా కూడా తన వెంట ఎగురుతూ వచ్చేది. అయితే ఈ విషయం అటవీ అధికారులకు తెలియడంతో ఆ కొంగను ఆరిఫ్‌ నుంచి బలవంతంగా తీసుకెళ్లి జూకు తరలించారు. అయితే చాలా రోజుల తర్వాత ఆరిఫ్ కొంగను చూసేందుకు జూకు వెళ్లారు. ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు మాస్క్‌ను కూడా ధరించాడు. ఆ కొంగ మాత్రం ఆరిఫ్‌ను గుర్తుపట్టేసింది. సంతోషంతో ఊగిపోయి నృత్యం చేసింది. ఈ దృశ్యాలను ఆరిఫ్ వీడియో తీసి తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..