ఉరిశిక్షల విధింపులో మనమే టాప్.. ట్రయల్ కోర్టుల ‘ దూకుడు ‘

మృగాళ్లకు, ఇతర దారుణ నేరాలకు పాల్పడేవారికి ఉరి శిక్షలు విధిస్తున్న ఏడు టాప్ దేశాల్లో ఇండియా కూడా చేరింది. 2016… 2018 మధ్య కాలంలో ఈ దేశంలోని దిగువ కోర్టులు 420 ఉరి శిక్షల అమలుకు సంబంధించి తీర్పులిచ్చాయి. గత 20 ఏళ్లలో 20 మంది నేరస్థులకు మాత్రమే ఉరిశిక్షలను అమలు చేశారు. వీరిలో ఉగ్రవాద సంబంధ కేసుల్లో దోషులైన అజ్మల్ కసబ్, అఫ్జల్ గురు, యాకుబ్ మెమన్ కాగా- పశ్చిమ బెంగాల్ లో 14 ఏళ్ళ […]

ఉరిశిక్షల విధింపులో మనమే టాప్.. ట్రయల్ కోర్టుల ' దూకుడు '
Pardhasaradhi Peri

|

Dec 14, 2019 | 2:15 PM

మృగాళ్లకు, ఇతర దారుణ నేరాలకు పాల్పడేవారికి ఉరి శిక్షలు విధిస్తున్న ఏడు టాప్ దేశాల్లో ఇండియా కూడా చేరింది. 2016… 2018 మధ్య కాలంలో ఈ దేశంలోని దిగువ కోర్టులు 420 ఉరి శిక్షల అమలుకు సంబంధించి తీర్పులిచ్చాయి. గత 20 ఏళ్లలో 20 మంది నేరస్థులకు మాత్రమే ఉరిశిక్షలను అమలు చేశారు. వీరిలో ఉగ్రవాద సంబంధ కేసుల్లో దోషులైన అజ్మల్ కసబ్, అఫ్జల్ గురు, యాకుబ్ మెమన్ కాగా- పశ్చిమ బెంగాల్ లో 14 ఏళ్ళ బాలికపై హత్యాచారానికి పాల్పడిన ధనుంజయ్ ఛటర్జీకి రేప్ సంబంధ కేసులో మరణశిక్ష అమలైంది. ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ 39 వ ప్రాజెక్టు నివేదిక ప్రకారం.. ట్రయల్ కోర్టులు మొత్తం 162 మందికి మరణ శిక్షలు విధించాయి. (ఈ విషయాన్ని అంతర్జాతీయంగా ఆయా కోర్టులు విధిస్తున్న డెత్ పెనాల్టీల పై ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తన వార్షిక నివేదికలో పేర్కొంది). ఒక్క 2018 లోనే ఇన్ని (162) శిక్షల తాలూకు తీర్పులు రావడం ఈ శతాబ్దంలోనే అత్యధికమట. అంతకు ముందు 2007 లో 154 డెత్ పెనాల్టీలను దిగువకోర్టులు ప్రకటించాయి. గత ఏడాది ముగుస్తుండగా 426 మంది దోషులు ఉరికొయ్యల సమీపంలో ‘ నిలబడ్డారు ‘. ఈ డెత్ పెనాల్టీల్లో నలభై ఐదు హత్య కేసులకు, 58 హత్యాచార కేసులకు సంబంధించినవని ఈ నివేదిక వెల్లడించింది. ఇలా… చైనా, ఈజిప్టు ,ఇరాక్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మలేసియా, వియత్నాం దేశాల లిస్టులో ఇండియా కూడా చేరిందని ఈ రిపోర్టు పేర్కొంది. గత ఏడాది 18 కేసుల్లో 23 ఉరి శిక్షలను హైకోర్టులు ధృవీకరించాయి. అంతకుముందు సంవత్సరంలో దిగువ కోర్టులు 108 డెత్ పెనాల్టీలను విధించగా పదకొండింటిని మాత్రం హైకోర్టులు కన్ఫామ్ చేశాయి. గత సంవత్సరం పన్నెండు కేసుల్లో ట్రయల్ కోర్టులు మరణశిక్షలకు సంబంధించి తీర్పులివ్వగా.. వీరిలో 23 మందిని హైకోర్టులు నిర్దోషులుగా విడిచిపుచ్ఛడం విశేషం. అయితే గత ఏడాది సుప్రీంకోర్టు ముగ్గురికి మాత్రమే ఉరిశిక్షల అమలు సక్రమమేనని స్పష్టం చేసింది. హత్య, రేప్, గ్యాంగ్ రేప్ వంటి నేరాలతో బాటు దేశ ద్రోహులు, సంఘ వ్యతిరేక శక్తులకు ఈ శిక్షలను విధిస్తున్నప్పటికీ.. చట్టంలోని లొసుగులు, ఇతర కారణాల దృష్ట్యా దోషులు ఉరిశిక్షల నుంచి తప్పించుకుంటున్నారు. యావజ్జీవ కారాగార శిక్షలు కూడా కొంతమంది దోషులకు మాత్రమే పడడాన్ని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu