భోపాల్ బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్.. వివాదాస్పద వ్యాఖ్యలకు ఈమె పెట్టింది పేరు. ఆర్టికల్ 370 రద్దుపై వ్యాఖ్యానిస్తూ ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాలు నిజమైన దేశభక్తులని, వారి నిర్ణయాన్ని వ్యతిరేకించేవారు దేశభక్తులు కాలేరంటూ వ్యాఖ్యానించారు. అయితే ఇప్పటికే జమ్ము కశ్మీర్ అంశంపై మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ చేసిన ఘాటు వ్యాఖ్యల్ని కూడా ప్రఙ్ఞాసింగ్ సమర్థించారు. దేశాన్ని ముక్కలు చేసిన వారు నేరస్థులేనంటూనెహ్రూను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్‌తో యుద్ధం చేస్తున్న సమయంలో జవహర్‌లాల్ నెహ్రూ కాల్పుల విరమణ ప్రకటించి నేరం చేశారని చౌహాన్ అన్నారు. తాజాగా ఆ వ్యాఖ్యల్ని ఈ ఎంపీ ప్రజ్ఞాసింగ్ సమర్ధించారు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వాదోపవాదాలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సాధ్వి ప్రఙ్ఞాసింగ్ జవహర్‌లాల్ నెహ్రూపై ఈ విధంగా మాట్లాడటంపై కాంగ్రెస్ వర్గాలకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.