Anurag Thakur: కాంగ్రెస్‌పై మరోసారి మండిపడ్డ బీజేపీ ఎంపీ.. తన వ్యాఖ్యలను సమర్ధిస్తూ..

|

Aug 01, 2024 | 5:47 PM

మంగళవారం లోక్‌సభ వేదికగా కులంపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానికి దారి తీశాయి. ఠాకూర్ వ్యాఖ్యలను పలువురు ఇండియా బ్లాక్ నేతలు తీవ్రంగా ఖండించగా.. ప్రధాని మోదీ ఆయన వ్యాఖ్యల్ని సమర్ధిస్తూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

Anurag Thakur: కాంగ్రెస్‌పై మరోసారి మండిపడ్డ బీజేపీ ఎంపీ.. తన వ్యాఖ్యలను సమర్ధిస్తూ..
Anurag Thakur
Follow us on

తమ కులం ఏంటో తెలియనివారు కులగణన కోరుతున్నారని బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ మంగళవారం లోక్‌సభ వేదికగా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానికి దారి తీశాయి. ఠాకూర్ చేసిన ఈ వ్యాఖ్యలను పలువురు ఇండియా బ్లాక్ నేతలు ఖండించారు. అయితే ప్రధాని మోదీ మాత్రం ఠాకూర్ వ్యాఖ్యల్ని సమర్ధిస్తూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

ఇక ‘తమ పార్టీ ప్రధాన నేత రాహుల్ గాంధీని అవమానించేందుకే ఠాకూర్ ఈ వ్యాఖ్యలు చేశారని.. ఆయన పరిపక్వత లేనివాడు. పార్లమెంటులో ఎవరి కులం అడగరు. వారి నాయకులు చాలామంది కులాంతర లేదా మతాంతర వివాహం చేసుకున్నారు. వారు అందరి కులాల గురించి అడుగుతారా? ఇది తప్పుడు చర్య’ అని మల్లిఖార్జున్ ఖర్గే ధ్వజమెత్తారు.

ఈ క్రమంలోనే తన వ్యాఖ్యలకు వివరణ ఇస్తూ ఇటీవల అనురాగ్ ఠాకూర్ ట్విట్టర్‌లో స్పందించారు. ‘నా స్పీచ్ కొందరి మనోభావాలను తీవ్రంగా గాయపరచవచ్చు. నా మాటలకు వారు బాధపడవచ్చు. తమకే ప్రత్యేక హక్కులు ఉన్నందున ప్రశ్నలు అడిగే హక్కు తమకు మాత్రమే ఉందని వారు భావిస్తున్నారు. కులంపై నేను చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు ఎవరైతే మండిపడుతున్నారో.. వారి పూర్వీకులే దేశంలోని వెనుకబడిన, దళిత, అణగారిన ప్రజలను మూర్ఖులుగా అభివర్ణించారు’ అని కాంగ్రెస్‌ నేతలపై పరోక్షంగా మండిపడ్డారు బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్