ఈశాన్య రాష్ట్రాల్లో మరోసారి భూ ప్రకంపనలు

|

Jun 24, 2020 | 10:16 AM

మిజోరాంలో మరోసారి భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 4.1 తీవ్రతగా నమోదయ్యింది. (జూన్ 24) బుధవారం ఉదయం 08:02 గంటలకు ఛాంపాయికి 31 కిలోమీటర్ల దూరంలో....

ఈశాన్య రాష్ట్రాల్లో మరోసారి భూ ప్రకంపనలు
Follow us on

Another earthquake hits Mizoram : మిజోరాంలో మరోసారి భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 4.1 తీవ్రతగా నమోదయ్యింది. (జూన్ 24) బుధవారం ఉదయం 08:02 గంటలకు ఛాంపాయికి 31 కిలోమీటర్ల దూరంలో ఈ భూ ప్రకంపనలు వచ్చినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. మంగళవారం దేశంలో చాలా ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. మిజోరాంలో 3.7 తీవ్రతతో భూకంపం సంభవించిన తరువాత, ఈశాన్య రాష్ట్రాల్లో ఇలా వరుసగా భూమి కంపింస్తోంది.

ఆదివారం, సోమవారం రెండు సార్లు మిజోరాంలో ప్రకంపనలు సంభవించాయి, అనేక ప్రాంతాల్లో ఇళ్ళు , రోడ్లపై పగుళ్లు ఏర్పడ్డాయి. ఆదివారం రోజు సైతాల్ జిల్లాలో 5.1 తీవ్రతతో ప్రకంపనలు సంభవించగా.. సోమవారం చంపై జిల్లాలో 5.3 తీవ్రతతో భూకి కంపించింది. అయితే ఇలా వరుస భూ ప్రకంపనలు వస్తుండటంతో ఈశాన్య రాష్ట్రాల ప్రజలు వణికిపోతున్నారు.