Andhra: అయ్యో.. ఎంత కష్టమొచ్చిందో ఆ తల్లికి.. కొడుకును బయటకు నెట్టి.. కూతురితో కలిసి..

తిరువనంతపురం--నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ చుండూరు మండలం మోదుకూరు వద్దకు రాగానే స్లో అయింది. అలా.. స్లో అయిన రైలు నుండి ఒక తల్లి ఇద్దరు బిడ్డలతో సహా కిందకి దిగింది. అక్కడే రైల్వే పనులు చేస్తున్న కూలీలతో కలిసి భోజనం చేసింది. తన బాధనంతా చెప్పుకుంది. భర్తతో విబేధాల కారణంతో ఇళ్లు వదిలేసివచ్చినట్లు కూలీలకు అర్ధమైంది.

Andhra: అయ్యో.. ఎంత కష్టమొచ్చిందో ఆ తల్లికి.. కొడుకును బయటకు నెట్టి.. కూతురితో కలిసి..
Crime News

Edited By: Shaik Madar Saheb

Updated on: Jun 19, 2025 | 12:50 PM

తిరువనంతపురం–నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ చుండూరు మండలం మోదుకూరు వద్దకు రాగానే స్లో అయింది. అలా.. స్లో అయిన రైలు నుండి ఒక తల్లి ఇద్దరు బిడ్డలతో సహా కిందకి దిగింది. అక్కడే రైల్వే పనులు చేస్తున్న కూలీలతో కలిసి భోజనం చేసింది. తన బాధనంతా చెప్పుకుంది. భర్తతో విబేధాల కారణంతో ఇళ్లు వదిలేసివచ్చినట్లు కూలీలకు అర్ధమైంది. వారంతా కలిసి ఆమె ఓదార్చినప్పటికీ భాష తెలియకపోవడంతో ఇబ్బంది ఎదురైంది. అయితే సాయంత్రం వరకూ అక్కడే ఉన్న ఆమె ఐదు గంటల సమయంలో ఎదురుగా వస్తున్న ట్రైన్ కింద పడి కుమార్తెతో సహ ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆ సమయంలో తనతో పాటు ఉన్న కొడుకును మాత్రం బయటకు నెట్టివేసింది. ఈ ఘటన స్థానికంగా ఉన్న వారిని తీవ్ర కలవరపాటుకు గురి చేసింది. అప్పటి వరకూ ధైర్యంగా ఉన్న ఆమె ఒక్కసారిగా ఆత్మహత్య చేసుకోవడం.. కొడుకును బయటకు నెట్టి, కుమార్తెను తనతో ఉంచుకోవడం చూసిన వారి కళ్లు చెమర్చాయి. తల్లి ఒడి నుండి దూరమైన ఆరేళ్ల బాలుడిని స్థానికులు రైల్వే పోలీసులకు అప్పగించగా బాలుడిని వసతి గృహానికి తరలించారు.

పోలీసుల విచారణలో అనేక అంశాలు వెలుగు చూశాయి. బీహార్లోని సీతామర్తి జిల్లా బైర్గానియాలోని బింగాహి గ్రామానికి చెందిన పూనందేవి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇళ్లు వదిలి పెట్టి వచ్చింది. రైలుతో ఏడాది వయస్సున్న కుమార్తె, ఆరేళ్ల వయస్సున్న కొడుకుతో కలిసి ఎక్కడి వెళ్లాలో తెలియని స్తితిలో మధ్యలోనే రైలు దిగేసింది. ఇద్దరి పిల్లలతో ఆత్మహత్య చేసుకునేందుకు మొదట ప్రయత్నించిన పూనందేవి రైల్వే ట్రాక్ పై పడుకున్న తర్వాత చివరి నిమిషంలో మనస్సు మార్చుకొని కొడుకును బయటకు నెట్టేసింది. కళ్లు మూసి తెరిచేలోపులో కొడుకు బయటపడగా కుమార్తె, ఆమె మాత్రం రైలు చక్రాల కింద నలిగిపోయారు.

తమ కళ్ల ముందే ఈ ఘటన చోటు చేసుకోవడంతో రైల్వే కూలీలు చలించిపోయారు. వెంటనే బాలుడిని తీసుకొని రైల్వే స్టేషన్ వెళ్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు మ్రుత దేహాలను ఆసుపత్రికి తరలించారు. బీహర్ లోని పూనందేవి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..