ప్రజాస్వామ్య దేశంలో ఓటు ఎంత పవర్‌ఫుల్ ఆయుధం! తమకు నచ్చిన, తమను మెచ్చిన నాయకుడిని ఎన్నుకునే అవకాశం కల్పించేదే ఓటు.. చాలా మంది ఓటేయడానికి బద్దకిస్తారు.. ఓటు వేయాలన్న ఆసక్తి కనబర్చేవాళ్లు కూడా అధికంగానే ఉన్నారు.. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఇవాళ తుది విడత పోలింగ్ జరుతున్నది కదా! కతిహార్‌లో ఉన్న ఓ పోలింగ్ బూత్‌కు స్థానికులు ఓ వృద్ధ ఓటరును మంచంపై తీసుకురావడం గమనార్హం.. ఆయనను బలవంతగా తీసుకురాలేదు.. ఓటేయాలన్న ఆయన ఆరాటం చూసే మంచంపై తీసుకొచ్చారు.. తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆ వయసుమళ్లిన ఓటరును మంచం మీద పోలింగ్‌బూత్‌కు తెచ్చారు. బూత్‌లోపలి వరకు అలాగే తీసుకెళ్లారు. ఆయన సగర్వంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.. ఇందుకు కుటుంబసభ్యులు కూడా తోడ్పాటు అందించారు. ఇవాళ మొత్తం 74 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.. ఔరాయిలోని ఓ పోలింగ్ బూత్‌లో ఓ విషాద ఘటన జరిగింది.. అక్కడ ప్రిసైడెంగ్ ఆఫీసర్ గుండెపోటుతో చనిపోయారు.