Amit Shah: వారంతా భ్రమపడుతున్నారు.. ఈడీ అధికారాలు అలానే ఉంటాయి.. ప్రతిపక్షాలపై అమిత్ షా ఫైర్

|

Jul 11, 2023 | 8:21 PM

Amit Shah on opposition parties: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చీఫ్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలం పొడగింపుపై సర్వోన్నత న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తంచేసింది. కేంద్రప్రభుత్వం ఈడీ చీఫ్‌ సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలన్ని మూడోసారి పొడిగించడం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు మంగళవారం ప్రకటించింది.

Amit Shah: వారంతా భ్రమపడుతున్నారు.. ఈడీ అధికారాలు అలానే ఉంటాయి.. ప్రతిపక్షాలపై అమిత్ షా ఫైర్
Union Home Minister Amit Shah
Follow us on

Amit Shah on opposition parties: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చీఫ్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలం పొడగింపుపై సర్వోన్నత న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తంచేసింది. కేంద్రప్రభుత్వం ఈడీ చీఫ్‌ సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలన్ని మూడోసారి పొడిగించడం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు మంగళవారం ప్రకటించింది. జులై 31వ తేదీ వరకు మిశ్రా ఈ పదవిలో కొనసాగవచ్చని కేంద్రానికి తెలిపింది. దీంతో విపక్ష నేతలంతా కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు. సుప్రీం నిర్ణయం కేంద్ర ప్రభుత్వానికి చెంపపెట్టుగా అభివర్ణిస్తున్నారు. కాగా.. సుప్రీం నిర్ణయం తర్వాత ఈ విషయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పుతో సంబరాలు చేసుకుంటున్న వారు వివిధ కారణాలతో భ్రమపడుతున్నారంటూ ఫైర్‌ అయ్యారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

ED చీఫ్‌ కేసు విషయంలో సుప్రీం కోర్టు నిర్ణయంపై సంతోషిస్తున్న వారు వివిధ కారణాల వల్ల భ్రమపడుతున్నారు.. సివిసి చట్టానికి సవరణలు చేసి పార్లమెంటు ఆమోదించినట్లు గుర్తుచేశారు. అవినీతిపరులు, అక్రమార్కులపై ఉక్కుపాదం మోపడానికి ED అధికారాలు అలాగే ఉంటాయంటూ స్పష్టంచేశారు. ED అనేది ఒక పెద్ద సంస్థ అని.. దాని ప్రధాన లక్ష్యాన్ని సాధించడంపై దృష్టి సారిస్తుంది.. అంటే మనీలాండరింగ్, విదేశీ మారకపు చట్టాల ఉల్లంఘనల నేరాలను పరిశోధించడం అన్నారు. ఈ విధంగా, ED డైరెక్టర్ ఎవరు – అది ముఖ్యం కాదు ఎందుకంటే ఈ పాత్రను ఎవరు స్వీకరించినా, అభివృద్ధి నిరోధక మనస్తత్వం కలిగి హాయిగా ఉన్న రాజవంశీయుల అవినీతిని గమనిస్తుందటూ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మనీలాండరింగ్‌ – ఆర్థిక నేరాలపై దర్యాప్తు చేసే ఈడీ చీఫ్‌ గా ఎస్‌కే మిశ్రా 2018 నవంబర్‌లో బాధ్యతలను చేపట్టారు. అయితే రెండేళ్లకే ఆయన రిటైర్‌ కావాల్సి ఉంది. కానీ, కేంద్రం ఆయన పదవీ కాలాన్ని మూడుసార్లు పొడిగించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..