Mumbai Schools Closed: మహారాష్ట్ర రాజధాని ముంబైలో రోజు రోజుకీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో నడిచే పాఠశాలలు తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు అన్ని పాఠశాలలు మూసివేస్తున్నామని ముంబై మునిసిపల్ కార్పొరేషన్ తెలిపింది. దేశ ఆర్ధిక రాజధాని లో రోజు రోజుకీ కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని మేయర్ కిషోర్ పడ్నేకర్ చెప్పారు.
మహారాష్ట్రలో దాదాపు 8 నెలల తర్వాత పాఠశాలలను పునః ప్రారంభించాయి. నవంబర్ 23 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు తెరుచుకున్నాయి. కానీ ముంబై లో మాత్రం స్కూళ్లకు డిసెంబర్ 31 వరకు సెలవలు ప్రకటించారు. అయితే తాజాగా మళ్లీ ముంబై లో కోవిడ్ కేసులు భారీగా నమోదయ్యాయి దీంతో మళ్ళీ స్కూల్స్ ను మూసివేస్తున్నారు.
అయితే ఇప్పటికే పాఠశాల యాజమాన్యం స్కూళ్లకు వచ్చేవిద్యార్ధులు కోవిడ్ నిబంధనలు పాటించేలా పాఠశాలల్లో శానిటైజర్లు సిధ్ధంగా చేశారు. విద్యార్ధులు మాస్క్ లు తప్పని సరిగా ధరించేలా చర్యలు చేపడుతున్నారు. స్కూలుకు హజరయ్యే ముందు ఉపాధ్యాయులందరూ కోవిడ్ టెస్ట్ చేయించుకుని నెగెటివ్ రిపోర్టు వచ్చిన వారు మాత్రమే విధులకు హజరవ్వాలని విద్యాశాఖ అదేశాలు జారీ చేసింది. విద్యార్దులు కూడా క్లాస్ రూమ్ లో భౌతిక దూరం పాటిస్తూ కూర్చునేలా ఏర్పాట్లు చేయాలని విద్యా శాఖమంత్రి వర్షాగైక్వాడ్ ఆదేశాల మేరకు అన్ని చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్ , ఒడిశా, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, హర్యానా, బీహార్లతో సహా పలు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పాఠశాలలను తెరిచాయి
Also Read: మహారాష్ట్రలో విజృంభిస్తున్న బర్ద్ ఫ్లూ, మరో రెండు జిల్లాలో నిర్ధారణ.. 2000 కోళ్లు కల్లింగ్