అలర్ట్‌‌..18 కోట్ల పాన్ కార్డులపై వేటు పడనుందా!

దేశవ్యాప్తంగా 18 కోట్ల పాన్ కార్డులపై వేడు పడనుందా..! అంటే అవుననే వార్తలే వినిపిస్తున్నాయి. పాన్ కార్డులను ఆధార్‌ కార్డుతో లింక్ చేయని

అలర్ట్‌‌..18 కోట్ల పాన్ కార్డులపై వేటు పడనుందా!
Follow us

| Edited By:

Updated on: Aug 21, 2020 | 1:23 PM

Pan Card Users: దేశవ్యాప్తంగా 18 కోట్ల పాన్ కార్డులపై వేడు పడనుందా..! అంటే అవుననే వార్తలే వినిపిస్తున్నాయి. పాన్ కార్డులను ఆధార్‌ కార్డుతో లింక్ చేయని పాన్ కార్డులను నిర్వీర్యం చేస్తామని ఐటీ శాఖ తెలిపింది. గడువు ముగిసేలోగా పాన్‌ను ఆధార్‌ నంబర్‌తో జోడించాలని ఆ శాఖ స్పష్టం చేసింది. అలాగే ఒకటి కన్నా ఎక్కువ పాన్ కార్డులను ఉపయోగించే వారిని, పన్ను ఎగవేతదారులను, అధిక మొత్తాల్లో లావాదేవీలు జరిపే వారిని గుర్తించే పనిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. కొంతమంది పన్నులను ఎగవేసేందుకు ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉపయోగిస్తున్నారని ఐటీ అధికారులు వెల్లడించారు.

పాన్‌ని ఆధార్‌తో లింక్ చేస్తే, ఒకటి కంటే ఎక్కువ పాన్‌ కార్డులు పొందే అవకాశం ఉండదని, అందుకే చాలా మంది లింక్ చేసుకోవడం లేదని వివరించారు. కాగా 130కోట్ల మంది జనాభా ఉన్న మనదేశంలో కేవలం కోటిన్నర మంది మాత్రమే ఆదాయపు పన్నును చెల్లిస్తున్నారని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపు దారుల సౌలభ్యం కోసం పారదర్శక పన్ను విధానం.. నిజాయితీపరులకు గౌరవం అన్న పోర్టల్‌ను ఐటీ శాఖ ప్రారంభించింది. దీని వలన పన్ను చెల్లింపు కోసం ప్రజలు కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరిగే అవసరం ఉండదని మోదీ తెలిపారు. పౌరులు కూడా బాధ్యతాయుతంగా పన్నులు చెల్లించాలని మోదీ విఙ్ఞప్తి చేశారు.

Read More:

కరోనాతో దిలీప్ కుమార్ సోదరుడు కన్నుమూత