తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు ఎంపీలు ప్రయాణిస్తున్న విమానం దారి మళ్లింది. సోమవారం పార్లమెంట్ సమావేశాలకు హాజరుకావాల్సిన వీరు ఎక్కిన ఎయిర్ ఇండియా విమానం వేరే దారికి మళ్లించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే..ఎయిర్ ఇండియాకు చెందిన కోల్‌కతా-ఢిల్లీ విమానం (ఏఐ-021) మొత్తం 242 మంది ప్రయాణికులతో సోమవారం ఉదయం బయలుదేరింది. అయితే వీరిలో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు లోక్‌సభ ఎంపీలు,ఇద్దరు రాజ్యసభ ఎంపీలు కూడా ఉన్నారు. వీరు ప్రయాణిస్తున్న విమానం సడెన్‌గా వెళ్లాల్సిన మార్గంలో కాకుండా అమృత్‌సర్ వైపు మళ్లించారు.
ఇలా జరగడానికి కారణం ట్రాఫిక్ సమస్యతో పాటు విమానంలో ఇంధనం తక్కువగా ఉన్న కారణంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) సలహా మేరకు దారి మళ్లించినట్టు అధికారులు వివరణ ఇచ్చారు. అయితే ఆర్టికల్ 370 రద్దును తృణమూల్ కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది.