Air india: ఎయిర్ ఇండియా విమానాయాన సంస్థ కీలక నిర్ణయం..! అదితెలిసి షాక్‌లో ఉద్యోగులు..ఇంతకీ ఎంటంటే..

|

May 21, 2022 | 9:38 PM

దేశంలోని ప్రముఖ విమానాయాన సంస్థల్లో ఎయిర్‌ఇండియా ఒకటి. టాటా గ్రూప్ ద్వారా నిర్వహించబడుతున్న ఎయిర్ ఇండియాపై ప్రయాణికుల సౌకర్యార్థం ఎప్పుడూ కొత్త నిర్ణయాలు, పథకాలు అమలు చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా

Air india: ఎయిర్ ఇండియా విమానాయాన సంస్థ కీలక నిర్ణయం..! అదితెలిసి షాక్‌లో ఉద్యోగులు..ఇంతకీ ఎంటంటే..
Air India
Follow us on

దేశంలోని ప్రముఖ విమానాయాన సంస్థల్లో ఎయిర్‌ఇండియా ఒకటి. టాటా గ్రూప్ ద్వారా నిర్వహించబడుతున్న ఎయిర్ ఇండియాపై ప్రయాణికుల సౌకర్యార్థం ఎప్పుడూ కొత్త నిర్ణయాలు, పథకాలు అమలు చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఎయిర్‌ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. దాంతో కంపెనీ ఉద్యోగులు కొందరు షాక్‌ అవుతున్నారు. వారికి ఏం చేయాలో పాలు పోని పరిస్థితిలో పడ్డారు. ఇంతకీ ఎయిర్‌ ఇండియా తీసుకున్న ఆ కీలక నిర్ణయం ఏంటంటే..టాటా గ్రూప్‌ రన్‌ ఎయిర్‌ ఇండియా సంస్థ తన కార్యాలయంలో ధూమపానం,మత్తు పదార్థాల వినియోగాన్ని నిషేధించింది. డ్యూటీ సమయంలో ఎవరైనా వీటిని తీసుకున్నట్టు తేలితే.. వారిపై క ఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఈ ఆర్డర్‌ను ఉల్లంఘించిన ఏ ఉద్యోగి అయినా సరే శిక్ష తప్పదని హెచ్చరించింది. ఈ విషయాన్ని విమానయాన సంస్థ చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ (సిహెచ్‌ఆర్‌ఓ) సురేష్ దత్ త్రిపాఠి తెలిపారు. విడుద‌ల‌కు కార‌ణ‌మేమిట‌న్న దానిపై క్లారిటీ రాలేదు.

టాటా గ్రూప్ జనవరి 27న ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసింది. టాటా స్టీల్ అనుభవజ్ఞుడైన త్రిపాఠి ఏప్రిల్‌లో ఎయిర్‌లైన్ CHROగా బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు సురేష్ దత్ త్రిపాఠి తన సంస్థ ఉద్యోగులకు ఓ లేఖ రాశారు. అందులో ఎయిర్ ఇండియా అనేది ఓ బాధ్యతాయుతమైన సంస్థ, ఇక్కడ ప్రతి ప్రయాణికుడికి మనం ఆరోగ్యకరమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందించాలని తెలిపారు. ‘ఈ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. ప్రతి ఉల్లంఘన తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని త్రిపాఠి హెచ్చరించారు.

ఎయిర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ (MD)గా క్యాంప్‌బెల్ విల్సన్‌ను నియమిస్తున్నట్లు టాటా సన్స్ మే 12న ప్రకటించింది. విల్సన్, 50, సింగపూర్ ఎయిర్‌లైన్స్ పూర్తి యాజమాన్యంలోని తక్కువ-ధర అనుబంధ సంస్థ అయిన స్కూట్ CEO. పూర్తి సేవ, తక్కువ ధర కలిగిన ఎయిర్‌లైన్స్ రెండింటిలోనూ అతనికి 26 సంవత్సరాలకు పైగా విమానయాన పరిశ్రమ నైపుణ్యం ఉంది.

ఇవి కూడా చదవండి