
ఎప్పటి పెరియార్.. ఎక్కడి విజయ్. ఈ ఇద్దరికీ సంబంధం ఉందా అసలు. ఏఐతో క్రియేట్ చేసి రచ్చ రేపారు. పోనీ.. దాన్నో క్రియేటివిటీగా తయారుచేసుంటే ఫర్వాలేదు. తమ పార్టీకి ఉపయోగపడే కంటెంట్‌తో రెడీ చేసుంటే అదో రకంగా ఉండేది. కాని, డీఎంకేను విమర్శించేందుకు వాడారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని. పైగా పెరియార్, అన్నాదురై వంటి వ్యక్తులను ఉపయోగించి.. డీఎంకేపై డిజిటల్ దాడికి దిగారు. స్టాలిన్ పార్టీని మామూలు డ్యామేజ్ చేయలేదా వీడియో. జనం నరనరాల్లోకి ఎక్కేసింది. వెంటనే.. డీఎంకే సైతం కౌంటర్ వీడియో రిలీజ్ చేయాల్సి వచ్చిందంటే.. విజయ్ ఏఐ వీడియో ఎంత డ్యామేజ్ చేసుంటుంది. తలపతి విజయ్ ఓ ట్రైలర్ రిలీజ్ చేశారు. మొత్తం 2 నిమిషాల 32 సెకన్లు వీడియో అది. ట్రైలర్‌లాగే కట్ చేసినా.. ఆల్‌మోస్ట్ సినిమా చూపించేశారు అందులో. స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే తీరు ఎలా ఉందో విమర్శిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వీడియో రిలీజ్ చేశారు. తలపతి విజయ్ మెయిన్ టార్గెట్ డీఎంకేనే. ఎక్కడా అన్నాడీఎంకేను విమర్శిస్తున్నట్టు కనిపించడం లేదు. అటు బీజేపీ తన సైద్ధాంతిక శత్రువు అంటున్నారు గానీ ఎక్కువ ఫోకస్ మాత్రం స్టాలిన్ పార్టీ మీదే. డీఎంకే బలం తమిళవాదం. అచ్చమైన ద్రవిడవాదం. తమిళ భాష, తమిళ సంస్కృతి కోసం నిరంతరం పోరాడుతున్న పార్టీగా తనను తాను ప్రజల ముందు చూపించుకుంటుంది డీఎంకే. సో, ఆ ఓటర్లను తనవైపు తిప్పగలిగితే చాలు.. డీఎంకేను ఓడించేసినట్టే అనేది టీవీకే అధినేత...