Air India Plane Crash: భారత్‌ను కుదిపేసిన అత్యంత ఘోర విమాన ప్రమాదాలివే.. 1985 తర్వాత అతిపెద్ద క్రాష్

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన దుర్ఘటన... కనీవినీ ఎరుగని విషాదమిది. రెండువందలకు పైగా ప్రాణాల్ని బలితీసుకున్న అత్యంత ఘోర ప్రమాదం. ప్రస్తుతానికి రిస్క్యూ ఆపరేషన్స్‌ మీదే ఫోకస్ చేసింది యంత్రాంగం. శిథిలాల తొలగిస్తున్నారు. ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. ఆ వివరాలు..

Air India Plane Crash: భారత్‌ను కుదిపేసిన అత్యంత ఘోర విమాన ప్రమాదాలివే.. 1985 తర్వాత అతిపెద్ద క్రాష్
Representative Image

Updated on: Jun 12, 2025 | 5:45 PM

టేకాఫ్‌ తీసుకున్న కొద్ది నిమిషాలకే అహ్మదాబాద్‌-లండన్‌ విమానం కుప్పకూలింది. అహ్మదాబాద్‌ మేఘాని ఏరియాలో సివిల్‌ ఆస్పత్రి సమీపంలోని జనావాసాలపై ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్‌లైన్ విమానం కూలింది. మొత్తంగా 242 ప్రయాణీకులు చనిపోయినట్టు అహ్మదాబాద్ సీపీ ప్రకటించారు. 1985 తర్వాత ఎయిర్‌ఇండియా విమానయాన సంస్థకు అతిపెద్ద క్రాష్‌ ఇది. ప్రమాదం సమయంలో 240మంది ప్రయాణికులు పది మంది క్యాబిన్‌ క్రూ.. ఇద్దరు పైలట్లు ఉన్నారు. ఇది ఇలా ఉంటే భారత్‌లో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదాలు ఏవంటే.?

1985 – ఎయిర్ ఇండియా ఫ్లైట్-182పై టెర్రరిస్ట్ ఎటాక్ జరిగింది. విమానాన్ని అట్లాంటిక్ మహాసముద్రంలో బాంబ్ పెట్టి పేల్చారు టెర్రరిస్టులు. ఈ విమాన ప్రమాదంలో 329 మంది మృతి చెందారు. భారత విమాన చరిత్రలో ఇదే అతిపెద్ద ప్రమాదం.

1996 – హర్యానాలో గాల్లోనే రెండు విమానాల ఢీకొన్నాయి. సౌదీ ఎయిర్ లైన్స్, కజకిస్తాన్ ఎయిర్ లైన్స్ విమానాలు రెండూ మిడ్ ఎయిర్‌లో ఢీకొట్టాయి. ఈ ఘటనలో 349 మంది మృతి చెందారు. ప్రపంచంలోనే అతిపెద్ద మిడ్ ఎయిర్ ప్రమాదాల్లో ఒకటి ఇది.

2010  మే 22– మంగళూరు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ IX812 విమానం ల్యాండింగ్‌లో రన్‌వే దాటి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 158 మంది మృతి చెందారు. కేవలం 8 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.

1990 – బెంగళూరు ఎయిర్ ఇండియా ప్రమాదంలో 92 మంది మృతి చెందారు. ల్యాండింగ్ సమయంలో కంట్రోల్ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగింది.

2000 – పట్నా ఎయిర్ సాహారా ప్రమాదం. ఈ విమాన ప్రమాదంలో 60కి పైగా మృతి చెందారు. ఇంజిన్ ఫెయిల్యూర్‌తో ఈ విమానం కుప్పకూలింది.

1978 – జనవరి 1: బాంద్రా తీరంలో ఎయిర్ ఇండియా విమానం కూలి 213 మంది మరణించారు.

1988 అక్టోబర్ 19: అహ్మదాబాద్ సమీపంలో ఇండియన్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ కూలి 133 మంది మరణించారు.