Ahmedabad Plane Crash: గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతదేహం గుర్తింపు

Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడంతో ఒక వ్యక్తి తప్ప మిగతా ప్రయాణికులు, సిబ్బంది అందరూ మరణించారు. ఈ ప్రమాదంలో మృతదేహాల గుర్తుపట్టలేని పరిస్థితి ఉండటంతో DNA పరీక్ష చేయవలసి వచ్చింది. ఇప్పటివరకు..

Ahmedabad Plane Crash: గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతదేహం గుర్తింపు

Updated on: Jun 15, 2025 | 1:43 PM

అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడంతో ఒక వ్యక్తి తప్ప మిగతా ప్రయాణికులు, సిబ్బంది అందరూ మరణించారు. ఆ ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఆయన కూడా ఈ ప్రమాదంలో మృతి చెందారు. మృతదేహాలు అన్ని కూడా మాంసపు ముద్దలుగా కావడంతో వారిని గుర్తించడం ఇబ్బందిగా మారిపోయింది. డీఎన్‌ఏ పరీక్షల ద్వారా మృతదేహాలను గుర్తించి కుటుంబీకులకు అప్పగిస్తున్నారు. అలాగే విజయ్ రూపానీ మృతదేహాన్ని కూడా గుర్తించారు. డీఎన్ఏ నిర్వహించి అది విజయ్‌ రూపానీ మృతదేహంగా గుర్తించారు అధికారులు.

ఈ ప్రమాదంలో మృతదేహాల గుర్తుపట్టలేని పరిస్థితి ఉండటంతో DNA పరీక్ష చేయవలసి వచ్చింది. ఇప్పటివరకు 32 మృతదేహాలపై DNA మ్యాచ్‌లు అయినట్లు అధికారులు తెలిపారు.

డీఎన్ఏ పరీక్షల తర్వాత 14 మృతదేహాలను కుటుంబాలకు అప్పగింత:

మధ్యాహ్నం 12 గంటలకు అందిన సమాచారం ప్రకారం, DNA పరీక్ష తర్వాత 14 మృతదేహాలను కుటుంబాలకు అప్పగించారు. మృతదేహాలను తీసుకెళ్లే అంబులెన్స్‌తో పాటు పోలీసు ఎస్కార్ట్ వాహనాన్ని కూడా పంపారు. మృతుల ఇళ్లకు వైద్యుల బృందాన్ని కూడా పంపారు. ఉదయపూర్, వడోదర, అహ్మదాబాద్ నుండి మృతదేహాలను కుటుంబాలకు అప్పగించారు. అహ్మదాబాద్ నుండి 4, వడోదర నుండి 2, ఖేడా నుండి 1, అరవల్లి నుండి 1, బోటాడ్ నుండి 1, మెహ్సానా నుండి 4, ఉదయపూర్ నుండి 1 మంది ఉన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి