టాప్-10 ఉగ్రవాదుల కోసం భారత ఆర్మీ ఉగ్రవేట..

| Edited By:

May 14, 2020 | 4:20 PM

పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను భారత సైన్యం సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది. గత కొద్ది రోజులుగా దేశంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా దేశంలో లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ.. నిత్యం ఉగ్రవాదుల అలజడి.. సైన్యానికి కంటిమీద నిద్రలేకుండా చేస్తోంది. ఈ క్రమంలో నిత్యం భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం కూంబింగ్ చేపడుతున్నాయి. ఈ క్రమంలో హిజ్బుల్ ముజాహిద్దీన్ టాప్ కమాండర్‌ను హతమార్చాయి భద్రతా బలగాలు. అయితే లోయలో మరికొంత మంది ఉగ్రవాదులు యాక్టివ్‌గా ఉండటంతో వారి […]

టాప్-10 ఉగ్రవాదుల కోసం భారత ఆర్మీ ఉగ్రవేట..
Follow us on

పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను భారత సైన్యం సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది. గత కొద్ది రోజులుగా దేశంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా దేశంలో లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ.. నిత్యం ఉగ్రవాదుల అలజడి.. సైన్యానికి కంటిమీద నిద్రలేకుండా చేస్తోంది. ఈ క్రమంలో నిత్యం భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం కూంబింగ్ చేపడుతున్నాయి. ఈ క్రమంలో హిజ్బుల్ ముజాహిద్దీన్ టాప్ కమాండర్‌ను హతమార్చాయి భద్రతా బలగాలు. అయితే లోయలో మరికొంత మంది ఉగ్రవాదులు యాక్టివ్‌గా ఉండటంతో వారి కోసం గాలింపు చేపడుతున్నారు.  ఈ క్రమంలో కశ్మీర్ లోయలో యాక్టివ్‌గా ఉన్న టాప్ 10 ఉగ్రవాదులను గుర్తించి.. వారి కోసం వేట ప్రారంభించింది.

టాప్ 10 ఉగ్రవాదుల లిస్ట్..

1. హిజ్బుల్ ముజాహిద్దీన్ కొత్త కమాండర్ డాక్టర్ సైఫుల్లా, కోడ్ నేమ్.. ఘజి హైదర్, డాక్టర్ సాహెబ్.. 2014లో హిజ్బుల్‌లో చేరిక
2. మొహ్మద్ అష్రఫ్ ఖాన్, కోడ్ నేమ్స్.. అష్రాఫ్ మౌల్వి, మన్సూలు ఉల్ ఇస్లాం.. 2016 సెప్టెంబర్ 9న హిజ్బుల్ ముజాహిద్దీన్‌లో చేరిక
3. జనైద్ సెహ్రాయ్, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది
4. మొహమ్మద్ అబ్బాస్ షేక్, కోడ్ నేమ్.. తురబి మౌల్వి, 2015 మార్చిలో హిజ్బుల్ ముజాహిద్దీన్‌లో చేరిక
5. జహిద్ జార్గర్, 2014 చివర్లో జైషే మొహమ్మద్‌లో చేరిక
6. షకూర్, 2015 నుంచి లష్కరే తొయిబాతో సంబంధాలు
7.ఫైసల్ భాయ్, ఏ ప్లస్ కేటగిరీకి చెందిన హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది (2015లో చేరిక)
8. షెరజ్ అల్ లోనె, కోడ్ నేమ్ మౌల్వి
9.సలీమ్ పరే, జైషే మొహమ్మద్‌తో సంబంధాలు
10. ఒవైసీ ముల్లిక్, లష్కరే తొయిబా ఉగ్రవాది

కాగా, ఈ ఏడాది ఏప్రిల్ చివరి నాటికి.. భారత సైన్యం దాదాపు డెబ్బై మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ముఖ్యంగా గత నెల ఏప్రిల్ మాసంలో దాదాపు ముప్పై మంది ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది.