చిదంబరానికి లై డిటెక్షన్ టెస్ట్ ? సీబీఐ యోచన ?

|

Aug 27, 2019 | 3:52 PM

ఐ ఎన్ ఎక్స్ మీడియా కేసులో మాజీ కేంద్ర మంత్రి చిదంబరం ఇస్తున్న సమాధానాలపట్ల సీబీఐ అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. ఆయనకు లై డిటెక్షన్ టెస్టును నిర్వహించేందుకు సుప్రీంకోర్టు అనుమతిని కోరాలా అని యోచిస్తున్నట్టు ఈ దర్యాప్తు సంస్థకు చెందిన వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు తాము అడిగిన ప్రశ్నలకు చిదంబరం సరిగా సమాధానాలు ఇవ్వలేదని ఈ వర్గాలు వెల్లడించాయి. చాలావాటికి  ‘ నాకు గుర్తు లేదు ‘, ‘ తెలియదు ‘ అంటూ దాటవేశారని సీబీఐ అంటోంది. […]

చిదంబరానికి లై డిటెక్షన్ టెస్ట్ ? సీబీఐ యోచన ?
Follow us on

ఐ ఎన్ ఎక్స్ మీడియా కేసులో మాజీ కేంద్ర మంత్రి చిదంబరం ఇస్తున్న సమాధానాలపట్ల సీబీఐ అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. ఆయనకు లై డిటెక్షన్ టెస్టును నిర్వహించేందుకు సుప్రీంకోర్టు అనుమతిని కోరాలా అని యోచిస్తున్నట్టు ఈ దర్యాప్తు సంస్థకు చెందిన వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు తాము అడిగిన ప్రశ్నలకు చిదంబరం సరిగా సమాధానాలు ఇవ్వలేదని ఈ వర్గాలు వెల్లడించాయి. చాలావాటికి  ‘ నాకు గుర్తు లేదు ‘, ‘ తెలియదు ‘ అంటూ దాటవేశారని సీబీఐ అంటోంది. అయితే ఈ ఆరోపణలను చిదంబరం సుప్రీంకోర్టులో ఖండించినట్టు తెలిసింది.

సీబీఐ అడిగిన అన్ని ప్రశ్నలకు తాను సరిగానే సమాధానాలు ఇచ్చానని, కానీ కేవలం కొంత సమాచారానికి సంబంధించిన ప్రశ్నలకు వారు తననుంచి సమాధానాలు రాబట్టేందుకు ప్రయత్నించారని ఆయన పేర్కొన్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా ఐ ఎన్ ఎక్స్ మీడియా కేసులో నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జీని, చిదంబరాన్ని ఫేస్ టు ఫేస్ కూర్చోబెట్టి సమాచారాన్ని రాబట్టాలని కూడా సీబీఐ యోచిస్తున్నట్టు తెలిసింది. ఈ కేసులో ఆమె అప్రూవర్ గా మారిన సంగతి తెలిసిందే. (కుమార్తె షీనా బోరా హత్య కేసులో ఆమె ముంబైలోని జైల్లో శిక్ష అనుభవిస్తోంది). కాగా-చిదంబరానికి తాత్కాలిక భద్రతను పొడిగించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.