Kerala-Norovirus: కేరళలో మళ్ళీ వెలుగులోకి వచ్చిన సరికొత్త వైరస్.. నోరో వైరస్.. లక్షణాలు ఏమిటంటే

|

Nov 12, 2021 | 7:56 PM

Kerala-Norovirus: ఏ క్షణాన కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిందో కానీ అప్పటి నుంచి మనవాళిపై పగబట్టినట్లు ప్రపంచంలో రోజుకో కొత్త వైరస్ వెలుగులోకి వస్తూ ఆందోళన..

Kerala-Norovirus: కేరళలో మళ్ళీ వెలుగులోకి వచ్చిన సరికొత్త వైరస్.. నోరో వైరస్.. లక్షణాలు ఏమిటంటే
Norovirus Cases
Follow us on

Kerala-Norovirus: ఏ క్షణాన కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిందో కానీ అప్పటి నుంచి మనవాళిపై పగబట్టినట్లు ప్రపంచంలో రోజుకో కొత్త వైరస్ వెలుగులోకి వస్తూ ఆందోళన కలిగిస్తూనే ఉంది. ఇక మనదేశంలో కరోనా వైరస్ మొదటి కేసు వెలుగులోకి వచ్చింది కేరళలోనే.. ఇక్కడ రోజుకో కొత్త వైరస్ వెలుగులోకి వస్తుంది. తాజాగా మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. దీనిని నోరో వైరస్ అంటారని వైద్యులు చెప్పారు. ఈ వైరస్ రెండు వారాల క్రితం వాయనాడ్ జిల్లాలోని వైత్తిరి సమీపంలోని పూకోడ్‌లోని వెటర్నరీ కళాశాలో వెలుగులోకి వచ్చింది. గత 15 రోజుల వ్యవధిలో 13 మంది విద్యార్థులకు నోరోవైరస్ ఇన్‌ఫెక్షన్ సోకిందని కేరళ ప్రభుత్వం ఈరోజు ప్రకటించింది. అంతేకాదు ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వచ్చిందని.. అయితే నోరో వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా నివారణ చర్యల్లో భాగంగా పశువైద్య విజ్ఞాన కళాశాల విద్యార్థుల డేటా బ్యాంక్‌ను సిద్ధం చేస్తున్నామని ఆరోగ్య అధికారులు తెలిపారు.

ఈ వైరస్ లక్షణాలు వాంతులు, డయేరియాగా గుర్తించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. నోరో వైరస్​ అనేది అరుదైన వ్యాధి. కళాశాల క్యాంపస్​ బయట ఉండే హాస్టళ్లల్లోని విద్యార్థుల్లో తొలిసారి ఈ వైరస్​ను గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. వారి రక్తనమూనాలను సేకరించి అలప్పుజలోని ఎన్‌ఐవికి పంపారు.

తాజా పరిస్థితిపై ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ అధ్యక్షతన వాయనాడ్ లో ఆరోగ్య అధికారులతో సమావేశం నిర్వహించారు. నోరో వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు ముమ్మరం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నోరో వైరస్ సోకినవారు వెంటనే చికిత్స తీసుకుంటే వ్యాధి నుంచి కోలుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వ్యాధి, నివారణ మార్గాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. తరచుగా కేరళలో అంతుచిక్కని వ్యాధులతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. గత రెండు రోజుల క్రితం అంతు చిక్కని వైరస్ తో వీధి శునకాలు మృతి చెందిన సంగతి తెలిసిందే.

Also Read:  విచిత్ర గానంతో.. మీమ్స్‌తో పాపులర్ అయిన ఈ సిస్టర్స్.. రెహ్మాన్ మెచ్చిన గాయనీమణులు అని తెలుసా..