అమ్మోనియం నైట్రేట్ నిల్వలు.. చెన్నైకి ‘బీరూట్’‌ తరహా ముప్పు పొంచి ఉందా!

లెబ‌నాన్ రాజ‌ధాని బీరూట్‌లో జ‌రిగిన ప్రమాదంలో 135 మంది మృతి చెందగా.. వేల సంఖ్యలో గాయపడ్డ విషయం తెలిసిందే.

అమ్మోనియం నైట్రేట్ నిల్వలు.. చెన్నైకి 'బీరూట్'‌ తరహా ముప్పు పొంచి ఉందా!

లెబ‌నాన్ రాజ‌ధాని బీరూట్‌లో జ‌రిగిన ప్ర‌మాదంలో దాదాపు 135 మంది చనిపోగా., వేలాది మంది గాయపడ్డ విషయం తెలిసిందే. అక్కడి ఓడ‌రేవులో నిల్వ ఉన్న అమ్మోనియం నైట్రేట్ పేల‌డం వ‌ల్ల భారీ విధ్వంసం జ‌రిగింది. అయితే ఈ ఘటనతో ఇప్పుడు తమిళనాడు రాజధాని చెన్నైలో కలకలం మొదలైంది. చెన్నైలోని మనాలీ ప్రాంతంలో 2015 నుంచి అమ్మోనియం నైట్రేట్‌కి సంబంధించిన నిలువలు ఉండటంతో అక్కడ నివసిస్తోన్న వారు ఆందోళన చెందుతున్నారు.

అయితే దీనిపై కస్టమ్స్ అధికారులు వివరణ ఇచ్చారు. మనాలీలో సుమారు 740 మెట్రిక్ టన్నుల అమ్మోనియం నైట్రిట్ నిలువ ఉందని, దాని వలన ఎలాంటి ప్రమాదం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. అక్కడి భద్రత ప్రమాణాలను పర్యవేక్షిస్తున్నామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. అంతేకాదు మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ- వేలం ద్వారా ఈ అమ్మోనియంను అమ్మేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.

కాగా తమిళనాడులోని కరూర్‌కి చెందిన ఓ కంపెనీ అమ్మోనియం నైట్రేట్‌ని ప్రభుత్వ అనుమతి లేకుండా దక్షిణ కొరియా నుంచి కొనుగోలు చేసింది. దీంతో2015 కస్టమ్స్ అధికారులు దీన్ని సీజ్ చేసి, మనాలీ సమీపంలో నిల్వ చేశారు. ఇక ప్రభుత్వ ఆదేశాలతో ఆ కంపెనీ లైసెన్స్‌ను క్యాన్సిల్ చేశారు. దీనిపై సదరు కంపెనీ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది.

Read This Story Also: సుశాంత్‌ కాల్‌ డిటైల్స్: వెలుగులోకి కీలక విషయాలు

 

 

Click on your DTH Provider to Add TV9 Telugu