Kashmir: కశ్మీర్ ఉగ్రవాద గ్రూపుల వద్ద అత్యాధునిక అమెరికా పరికరాలు.. ఎక్కడి నుంచి వస్తున్నాయంటే..
Kashmir: కశ్మీర్ వ్యాలీలోకి తీవ్రవాదుల వద్ద అమెరికాకు చెందిన అత్యాధునిక ఆయుధాలు దొరకటం ఆందోళన కలిగిస్తోంది. సరిహద్దుల వద్ద భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తూ మృతి చెందిన ఉద్రవాదుల వద్ద వీటిని ఆర్మీ అధికారులు కనుగొన్నారు.
Kashmir: కశ్మీర్ వ్యాలీలోకి తీవ్రవాదుల వద్ద అమెరికాకు చెందిన అత్యాధునిక పరికరాలు దొరకటం ఆందోళన కలిగిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా దళాలు ఉపయోగించిన పదిహేను ఇరిడియం శాటిలైట్ ఫోన్‌లు, వై-ఫై-ఎనేబుల్ చేసిన థర్మల్ ఇమేజరీ పరికరాలు కాశ్మీర్ లోయలో టెర్రర్ గ్రూపుల వద్ద బయటపడ్డాయి. నియంత్రణ రేఖ వద్ద చొరబాటు ప్రయత్నం చేస్తూ హతమైన ఉగ్రవాదుల నుంచి ఈ అత్యాధునిక.. ఆయుధాలు, నిఘా పరికరాలను కనుగొన్నామని జీఓసీ డాగర్ డివిజన్ మేజర్ జనరల్ అజయ్ చంద్‌పురియా తెలిపారు. ఇటువంటి పరికరాలు సాధారణమైనవి కాదని అతను పేర్కొన్నాడు, “యుఎస్ దళాలు బయలుదేరినప్పుడు ఇవి ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నాయి.
శాటిలైట్ ఫోన్‌లు మొదట ఉత్తర కాశ్మీర్‌లో కనిపించాయని.. కానీ ఇప్పుడు అవి దక్షిణ కాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లోకి కూడా ప్రవేశించాయని ఆ ప్రాంతంలోని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ పరికరాలు ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా దళాలు డంప్ చేసిన వాటిలో భాగమై ఉండవచ్చు లేదా తాలిబాన్‌లు దొంగిలించి వినియోగిస్తూ ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఫోన్‌ల కదలికను పర్యవేక్షిస్తున్నట్లు భారత ఆర్మీ అధికారులు తెలిపారు. కొన్ని ఎన్‌కౌంటర్ సైట్‌ల నుంచి Wi-Fi ఎనేబుల్ చేసిన థర్మల్ ఇమేజరీ పరికరాలు లభించినట్లు వారు తెలిపారు.
ముఖ్యంగా రాత్రి సమయంలో భద్రతా వలయాన్ని తప్పించుకోవడానికి ఉగ్రవాదులు వీటిని ఉపయోగిస్తుంటారని ఆర్శీ అధికారులు తెలిపారు. ఈ పరికరాలు భద్రతా సిబ్బంది శరీర ఉష్ణోగ్రత ద్వారా వారు దగ్గరికి వస్తుంటే కనుగొనేందుకు, ఉగ్రవాదులు దాక్కునప్పడు చుట్టుపక్కల పరిసరాలను పరిశీలించేందుకు వినియోగిస్తుంటారు.
#WATCH | J&K: Maj Gen Ajay Chandpuria, GOC Dagger Division, Army says, “…Weapons/devices recovered from terrorists killed at LoC weren’t commonly seen. These were in Afghanistan when US troops left. Our analysis – not only terrorists but weapons can also come to Kashmir.”(18.2) pic.twitter.com/7C2xltz141
— ANI (@ANI) February 19, 2022
ఇవీ చదవండి..
Konaseema Road Accident: ఈస్టర్ వేళ విషాదం.. బ్రతుకులను చిదిమేసిన ఇసుకు లారీ
ICICI Insurance: బంపర్ రిజల్ట్స్ ప్రకటించిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ కంపెనీ.. లాభం రెండితలు..