Gujarat Politics: అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన 40 మందిపై క్రిమినల్ కేసులు.. వివరాలు ఇదిగో..
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగిసి, ప్రజాప్రతినిధులు కొత్తగా ఎన్నుకోవడం కూడా అయిపోయింది. అయితే మొత్తం 182 మంది సభ్యులు గుజరాత్ అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన వారిలో 40 మంది ఎమ్మెల్యేలపై.. క్రిమినల్ కేసులు.. ఇంకా..
Gujarat Political Parties
Follow us on
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగిసి, ప్రజాప్రతినిధులు కొత్తగా ఎన్నుకోవడం కూడా అయిపోయింది. అయితే గుజరాత్ రాజకీయా నాయకులలో చాలా మంది క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నవారే మొత్తం 182 మంది సభ్యుల గుజరాత్ అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన వారిలో 40 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు నడుస్తున్నాయి. ఈ విషయాన్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR), గుజరాత్ ఎలక్షన్ వాచ్ స్వయంగా తెలిపాయి. అయితే ఈ 40 మంది ఎమ్మెల్యేలలో 29 మంది సభ్యులు (మొత్తం 182 మందిలో 16 శాతం) హత్యాయత్నం, అత్యాచారం వంటి తీవ్రమైన క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారని ఏడీఆర్ విశ్లేషణలో తేలింది. 29 మంది సభ్యుల్లో 20 మంది బీజేపీ, నలుగురు కాంగ్రెస్, ఇద్దరు ఆమ్ ఆద్మీ పార్టీ, ఇద్దరు స్వతంత్రులు, ఒకరు సమాజ్ వాదీ పార్టీకి చెందినవ నాయకులు. ఏడీఆర్ అధ్యయనం ప్రకారం బీజేపీకి చెందిన 156 మంది ఎమ్మెల్యేలలో 26 (17 శాతం), కాంగ్రెస్కు చెందిన 17 మంది ఎమ్మెల్యేలలో 9 (53 శాతం), ఆప్ ఐదుగురు ఎమ్మెల్యేలలో ఇద్దరు (40 శాతం), ముగ్గురు స్వతంత్రులలో ఇద్దరు (68 శాతం), సమాజ్వాదీ పార్టీ ఏకైక అభ్యర్థి కంధల్ జడేజాపై క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయని తెలిసింది.
ఎన్నికల సంస్కరణల కోసం పని చేసే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ కొత్తగా ఎన్నికైన మొత్తం 182 మంది ఎమ్మెల్యేల అఫిడవిట్లను విశ్లేషించిన తర్వాత ఇటువంటి నివేదికలను విడుదల చేస్తుంది. 2017తో పోల్చితే క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల సంఖ్య తగ్గిందని, గతంలో 47 మంది అసెంబ్లీ సభ్యులు ఇలాంటి కేసులు ఎదుర్కొన్నారని ఏడీఆర్ తెలిపింది. ఇంకా ఈ సారి గెలిచినవారిలో ముగ్గురు అభ్యర్థులు ఐపీసీ సెక్షన్ 307 ప్రకారం హత్యాయత్నం కేసులను ఎదుర్కొంటున్నట్లు ఏడీఆర్ ప్రకటించింది. ఈ ముగ్గురు ఎవరంటే. వాన్స్డా నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన అనంత్ పటేల్, పాటాన్ నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కిరీట్ పటేల్, ఉనా నుంచి గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే కాళూభాయ్ రాథోడ్.
ఇంకా గెలిచిన వారిలో నలగురు అభ్యర్థులు ఐపీసీ సెక్షన్ 354 (మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం) లేదా సెక్షన్ 376 (అత్యాచారం) కింద కేసులను ఎదుర్కొంటున్నట్లు ఏడీఆర్ తన నివేదికలో పేర్కొంది. కాగా. డిసెంబరు 8న జరిగిన అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గుజరాత్లో రికార్డు స్థాయిలో 156 స్థానాలను గెలుచుకుని వరుసగా ఏడవసారి విజయం సాధించింది. ఇకపోతే కాంగ్రెస్ 17, ఆప్ 5 స్థానాల్లో విజయం సాధించి ఈ సారికి సరిపెట్టుకున్నాయి.