ఆప్ నేత, పంజాబ్ ఎమ్మెల్యే హర్జోత్ సింగ్ బెయిన్స్ (32) త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. పంజాబ్ కేడర్ ఐపీఎస్ ఆఫీసర్ జ్యోతీ యాదవ్‌ను ఈ నెలాఖరున వివాహం చేసుకోనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆమ్ ఆద్మీపార్టీ ఎమ్మెల్యే అయిన హర్జోత్ సింగ్ బైన్స్ తొలిసారి ఆనంద్‌పూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ప్రస్తుతం పంజాబ్ క్యాబినెట్‌లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పదవిలో కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ కుల్తార్ సింగ్ సంద్వాన్ ట్విటర్ వేదికగా ఈ జంటకు అభినందనలు తెలిపారు.
కాగా ఆనంద్‌పూర్ సాహిబ్‌లోని గంభీర్‌పూర్ గ్రామానికి చెందిన మంత్రి బైన్స్ వృత్తిరీత్యా న్యాయవాది. 2014లో చత్తీస్‌ఘడ్‌లోని పంజాబ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. పంజాబ్ రాష్ట్రంలో ఆప్ యూత్ వింగ్‌కు అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. తన నియోజక వర్గం నుంచి మొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికై పంజాబ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక ఐపీఎస్ అధికారిని అయిన జ్యోతి యాదవ్ పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో ఎస్పీ (సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్)గా విధులు నిర్వహిస్తున్నారు.
ਨਾਨਕ ਸਤਿਗੁਰੁ ਤਿਨਾ ਮਿਲਾਇਆ ਜਿਨਾ ਧੁਰੇ ਪਇਆ ਸੰਜੋਗੁ ॥੧॥ ਮਃ ੫ ॥
ਕੈਬਨਿਟ ਮੰਤਰੀ @harjotbains ਅਤੇ ਡਾਕਟਰ ਜਯੋਤੀ IPS ,ਜੋ ਕਿ ਆਉਣ ਵਾਲੇ ਦਿਨਾਂ ਚ ਜ਼ਿੰਦਗੀ ਦੇ ਨਵੇਂ ਸਫ਼ਰ ਦੀ ਸ਼ੁਰੂਆਤ ਕਰ ਰਹੇ ਹਨ,ਉਹਨਾਂ ਨੂੰ ਇਸ ਸੁਨਿਹਰੇ ਸਫ਼ਰ ਦੀਆਂ ਬਹੁਤ ਬਹੁਤ ਸ਼ੁਭਕਾਮਨਾਵਾਂ। pic.twitter.com/KcV5fRcMeP— Kultar Singh Sandhwan (@Sandhwan) March 12, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.