Aadhaar-Pan Linking Updates: మీ ఆధార్‌ పాన్‌తో లింక్ అయ్యిందా? లేదా? ఒక్క మెసేజ్‌తో ఇలా తెలుసుకోండి..

ఆధార్ కార్డ్.. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా జారీ చేయబడిన 12-అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య. ప్రభుత్వ రాయితీలు, పథకాలు, ఇతర ప్రయోజనాలను పొందేందుకు

Aadhaar-Pan Linking Updates: మీ ఆధార్‌ పాన్‌తో లింక్ అయ్యిందా? లేదా? ఒక్క మెసేజ్‌తో ఇలా తెలుసుకోండి..
Aadhar Pancard Linkege

Updated on: Feb 10, 2023 | 8:31 AM

ఆధార్ కార్డ్.. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా జారీ చేయబడిన 12-అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య. ప్రభుత్వ రాయితీలు, పథకాలు, ఇతర ప్రయోజనాలను పొందేందుకు ఇది డిజిటల్ గుర్తింపు రుజువుగా ఉపయోగించబడుతుంది. అయితే పాన్ అనేది 10-అంకెల ఆల్ఫాన్యూమరిక్ నంబర్. ఇది వ్యక్తులు, సంస్థలకు భారతీయ ఆదాయపు పన్ను శాఖ ద్వారా లామినేటెడ్ “పాన్ కార్డ్” రూపంలో జారీ చేయబడుతుంది.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) అప్‌డేట్‌ల ప్రకారం.. పాన్‌ను ఆధార్ కార్డ్‌తో లింక్ చేయడానికి 31 మార్చి, 2022 వరకు గడువు ఇచ్చారు. అయితే, ఆ తరువాతి పరిణామాల నేపథ్యంలో పాన్‌ కార్డ్‌ను- ఆధార్‌తో లింక్ చేయడానికి గడువును పొడిగిస్తూ వచ్చింది. తాజాగా చివరి తేదీని ప్రభుత్వం 31 మార్చి, 2023 వరకు పెంచింది. అయితే, నామమాత్రపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 139AA ప్రకారం మీ పాన్ కార్డ్‌ను ఆధార్‌తో లింక్ చేయకపోతే.. అది 1 ఏప్రిల్, 2023 నుండి పని చేయదు. అయితే, ఇప్పటికే చాలా మంది తమ పాన్ కార్డ్‌ను ఆధార్‌తో లింక్ చేసుకున్నారు. మరికొందరు చేశామో చేయలేదో తెలియక సందిగ్ధంలో ఉండిపోయారు. మరి పాన్-ఆధార్ లింక్ అయ్యిందా? లేదా? అని ఎలా తెలుసుకోవాలి? అంటే ఒక్క మేసెజ్ పంపితే చాలు వివరాలన్నీ వచ్చేస్తాయి. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

ఎస్ఎంఎస్ ద్వారా పాన్-ఆధార్ లింక్ డీటెయిల్స్ తెలుసుకుందాం..

1. ముందుగా మీ మొబైల్‌లో ఎస్ఎంఎస్ అప్లికేషన్ ఓపెన్ చేయాలి.
2. ఇప్పుడు, UIDPAN అని టైప్ చేసి, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి దీన్ని 567678 లేదా 56161కి పంపాలి.
3. త్వరలో, మీకు ‘‘మీ ఆధార్ ఇప్పటికే పాన్‌తో అనుసంధానం చేయబడింది. ITD డేటాబేస్‌లో మా సేవలను ఉపయోగించినందుకు ధన్యవాదాలు’’ అనే టెక్స్ట్‌తో కూడిన సందేశం మీ మొబైల్‌కు వస్తుంది.
4. మీ ఆధార్, పాన్ కార్డ్‌ని లింక్ చేయకుంటే, ‘‘ఆధార్ కార్డ్- పాన్ తో అనుసంధానించలేదు.’’ అని మెసేజ్ వస్తుంది.

మీ పాన్ కార్డ్-ఆధార్ కార్డ్ లింక్ చేయబడిందో, లేదో ఆన్‌లైన్‌లో ఇలా చెక్ చేసుకోండి..

1: https://pan.utiitsl.com/panaadhaarlink/forms/pan.html/panaadhaar వెబ్‌సైట్‌ని సందర్శించాలి.

2. మీ పాన్ నంబర్, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్‌ను నమోదు చేయాలి.

3. ఇప్పుడు సబ్మిట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

4. మీ ఆధార్, పాన్ కార్డ్ లింక్ స్టేటస్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

ఇ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా ఆధార్‌తో పాన్‌ను ఎలా లింక్ చేయాలి..

1. ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌ https://incometaxindiaefiling.gov.in/ కి వెళ్లాలి.

2. వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అవ్వాలి. మీ పాన్ నంబర్ మీ ‘యూజర్ ఐడి’ అవుతుంది.

3. యూజర్ ID, పాస్‌వర్డ్, పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా లాగిన్ చేయాలి.

4. ఇప్పుడు, పాప్-అప్ విండో కనిపిస్తుంది. మీ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయమని మిమ్మల్ని అడుగుతుంది.

5. విండో కనిపించకపోతే మెనూ బార్‌లోని ‘ప్రొఫైల్ సెట్టింగ్స్’కి వెళ్లి, ‘లింక్ ఆధార్’పై క్లిక్ చేయాలి.

6. పాన్ వివరాల ప్రకారం పేరు, పుట్టిన తేదీ, జెండర్ వంటి వివరాలను ఫిల్ చేయాలి.

7. ఆధార్‌లో పేర్కొన్న వాటితో స్క్రీన్‌పై పాన్ వివరాలను ధృవీకరించాలి.

8. వివరాలు సరిపోలితే, మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేసి ‘లింక్ నౌ’ బటన్‌పై క్లిక్ చేయాలి.

9. మీ ఆధార్ మీ పాన్‌కి విజయవంతంగా లింక్ చేయబడిందని పాప్-అప్ మెసేజ్ మీకు తెలియజేస్తుంది.

గమనిక : మీ పాన్ కార్డ్, ఆధార్‌ను లింక్ చేయడానికి https://www.utiitsl.com/ , https://www.egov-nsdl.co.in/కి కూడా వెళ్లవచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..