Aadhaar PVC Card : ఆధార్ కార్డు చాలా తప్పనిసరి పత్రాలలో ఒకటి. ఆధార్ కార్డ్ నంబర్ సంఖ్య మారదని అందరికి తెలుసు. కానీ ఫోటో, చిరునామా, ఫోన్ నంబర్ మొదలైన వాటిని మార్చవచ్చు. అయితే గతంలో కార్డు పోయినా లేదా ఏదైనా మార్పులు చేసినా ఆధార్ వెబ్‌సైట్ నుంచి కొత్త ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసి ప్రింట్ ఇచ్చేవారు కానీ ఇప్పుడు అది కుదరదు. వాస్తవానికి UIDAI ఇప్పుడు ఈ సేవను నిలిపివేసింది. ఇప్పుడు మీరు ఆధార్ వెబ్‌సైట్ నుంచి కొత్త కార్డ్ డౌన్‌లోడ్ చేయలేరు. దీని కోసం మీరు ఇతర పద్ధతులను ఉపయోగించాలి. అటువంటి పరిస్థితిలో ఏదైనా సమాచారాన్ని ఎలా అప్‌డేట్ చేయాలో లేదా ఆధార్ కార్డు పోయిన సందర్భంలో కొత్త కార్డును ఎలా సృష్టించాలో తెలుసుకుందాం.
వాస్తవానికి ఇటీవల ఈ నియమాలను ఒక వ్యక్తి ప్రశ్నకు సమాధానమిస్తూ ఆధార్ సహాయ కేంద్రం ట్విట్టర్‌లో తెలిపింది. ఒక వ్యక్తి ట్విట్టర్ ద్వారా అడిగారు నేను నా ఆధార్ కార్డును తిరిగి ముద్రించవచ్చా? దీనిపై ఆధార్ సహాయ కేంద్రం ఈ సేవను ఇప్పుడు నిలిపివేసినట్లు తెలిపింది. అధికారిక హ్యాండిల్ మాట్లాడుతూ.. ‘ఆధార్ పునర్ముద్రణ సేవ నిలిపివేయబడింది. మీరు ఆన్‌లైన్ ద్వారా ఆధార్ పివిసి కార్డును ఆర్డర్ చేయవచ్చు. మీరు దానిని సౌకర్యవంతమైన కాగితపు ఆకృతిలో ఉంచాలనుకుంటే మీరు ఇ-ఆధార్ నుంచి ముద్రణను పొందవచ్చని తెలిపింది.
ఆధార్ పివిసి కార్డ్ తయారు చేయడం చాలా సులభం. దీని కోసం మొదట అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి పివిసి కార్డుకు లింక్ పై క్లిక్ చేయాలి. మీరు నేరుగా ఈ లింక్‌కి కూడా వెళ్ళవచ్చు https://resident.uidai.gov.in/check-reprint-status. ఇక్కడ మిమ్మల్ని ఆధార్ కార్డుకు సంబంధించిన సమాచారం అడుగుతారు. దీని తరువాత మీరు OTP ద్వారా మీరే ప్రాసెస్ చేస్తారు. తరువాత ఫీజు చెల్లించాలి దాంట్లో ఇచ్చిన ఆప్షన్ ద్వారా పూరించాలి తరువాత అది స్వయంచాలకంగా మీ ఇంటికి చేరుకుంటుంది. ప్రత్యేక విషయం ఏమిటంటే ఇది ప్లాస్టిక్ కార్డు మాత్రమే కాదు దీనిపై QR కోడ్ ఉంటుంది. ఇంకా హోలోగ్రామ్ కూడా ఉంటుంది. ఇవన్నీ ఈ కార్డును చాలా హైటెక్ కార్డుగా చేస్తాయి. అలాగే ఈ కార్డు తీసుకెళ్లడం చాలా సులభం అంతేకాదు ఇది ఆధార్ కార్డు తాజా వెర్షన్.
Dear Resident, Order Aadhaar Reprint service has been discontinued, you can order Aadhaar PVC card online, instead. You can also take a print of your e-Aadhaar if you wish to keep it in a flexible paper format.
— Aadhaar Help Centre (@Aadhaar_Care) May 26, 2021