గవర్నమెంట్ ఆఫీసర్ల వర్క్ ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. చిన్న చిన్న పనుల కోసం రోజుల తరబడి ఆఫీస్ ల చుట్టూ మనమందరం తిరిగిన వాళ్లమే. ఇక రైతులు, సామాన్య ప్రజల సంగతి వేరే చెప్పక్కర్లేదు. రోజులకు రోజులు వారి పనులు పెండింగ్ లోనే ఉండిపోతాయి. ఒకవేళ చేసినా తూతూమంత్రంగా ఏదో కానిచ్చేస్తున్నారు. సరిగ్గా రాస్తున్నారో, డీటైల్స్ క్లియర్ గా ఉన్నాయో లేదో అన్న సోయి కూడా ఉండదు. పని పూర్తయిందని మనం సంతోషించినా తర్వాత మనమే ఇబ్బంది పడాలి. అందరూ ఇలా చేస్తారని కాదు గానీ.. కొందరు మాత్రం సరిగ్గా ఇలాగే చేస్తారు. అలాంటి వారికి ఈ వ్యక్తి ఇచ్చిన రియాక్షన్ మామూలుగా లేదు. పశ్చిమ బెంగాల్‌లో ఈ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి రేషన్ కార్డులో తన ఇంటిపేరు తప్పుగా నమోదు చేశారని అధికారి ఎదుట వినూత్న నిరసన తెలిపాడు. కుక్కలా అరుస్తూ నిరసన వ్యక్తం చేశాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
బంకురా జిల్లాలోని ఓ గ్రామానికి గడప వద్దకే ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ హాజరయ్యారు. అదే గ్రామానికి చెందిన శ్రీకాంతికుమార్ దుత్తా పేరును రేషన్ కార్డులో శ్రీకాంతికుమార్ కుత్తాగా నమోదు చేశారు. హిందీలో కుత్తా అంటే కుక్క అని అర్థం. దాంతో అతను తప్పుగా ప్రింట్ అయిన తన పేరును మార్చాల్సిందిగా అర్జీ పెట్టుకున్నాడు. గతంలో కూడా ఇతని పేరును శ్రీకాంత మొండల్ అని నమోదు చేశారట. దానిని సవరించాలని అర్జీ పెట్టుకోగా ఈసారి శ్రీశాంతో దుత్తాగా మర్చారు. మళ్లీ నా పేరు తప్పు ప్రింట్ చేశారో మొర్రో అంటూ అధికారులకు మొరపెట్టుకున్నాడు. ఇక ఇప్పుడు ఏకంగా అతని పేరు చివర ఇంటిపేరును దుత్తా బదులు కుత్తాగా ప్రింట్ చేసారు. దాంతో విసిగిపోయిన శ్రీకాంతికుమార్ ఈ వినూత్న నిరసనకు దిగాడు.
Infuriated after ration card mentioned surname as ‘kutta’ instead of ‘Dutta’, the man continued to bark at officer. #Viralvideo pic.twitter.com/zs5ov87jsR
— Arvind Chauhan (@Arv_Ind_Chauhan) November 19, 2022
ఈ క్రమంలో గడపవద్దకే ప్రభుత్వం కార్యక్రమానికి హాజరైన జిల్లా మెజిస్ట్రేట్‌ముందు కుక్కలా అరుస్తూ తన గోడు వెళ్లబోసుకున్నాడు. తన పేరును సరిచేయాలని మొరపెట్టుకుంటూ పత్రాలను సమర్పించాడు. వాటిని తీసుకున్న అధికారి సమస్యను పరిష్కరించాల్సిందిగా ఇతర అధికారులను ఆదేశిస్తూ పత్రాలను వారికి సమర్పించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..