Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్టూడెంట్స్ తో వెళ్తున్న బస్సు బోల్తా.. ఇద్దరు మృతి..

|

Dec 12, 2022 | 8:20 AM

మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఖోపోలి పోలీస్ స్టేషన్ పరిధిలో 48 మంది విద్యార్థులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ప్రమాదం జరిగిన...

Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్టూడెంట్స్ తో వెళ్తున్న బస్సు బోల్తా.. ఇద్దరు మృతి..
Accident
Follow us on

మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఖోపోలి పోలీస్ స్టేషన్ పరిధిలో 48 మంది విద్యార్థులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో చాలా మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం సమాచారం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గాయపడిన వారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. విద్యార్థులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదని తెలిపారు. సీనియర్ పోలీసు ఇన్స్పెక్టర్ గౌరీ మోర్ పాటిల్ మాట్లాడుతూ విద్యార్థులు విహారయాత్ర చేసి తిరిగి వస్తుండగా, బస్సు బోల్తా పడడంతో ఇద్దరు విద్యార్థులు మరణించారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

మహారాష్ట్రలోని పూణె జిల్లాలోని లోహ్‌ఘర్ కోట సమీపంలో గతంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. బస్సు ప్రమాదానికి గురవడంతో 15 మంది విద్యార్థులతో సహా 17 మంది గాయపడ్డారు. విహారయాత్రకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసు అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో 12-15 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులు ఉన్నారు. బస్సు బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతో డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయాడు. దీంతో వాహనం ప్రమాదానికి గురైంది. బస్సులో దాదాపు 28 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. క్షతగాత్రులను నవీ ముంబైలోని పన్వెల్, కలాంబోలిలోని ఆసుపత్రుల్లో చేర్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.