Crime: పచ్చని సంసారం లో రీల్స్ చిచ్చు.. భార్య అలా చేయడం ఇష్టం లేక.. గొంతు నులిమి దారుణంగా..

|

Sep 27, 2022 | 6:12 PM

సోషల్ మీడియా.. ఈ రెండు పదాలు చాలు.. యావత్ ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేస్తున్నాయి. అందరికీ సెల్ ఫోన్లు అందుబాటులోకి రావడం, అందుబాటులో ఉండే డేటా ప్యాకేజీలతో ఇప్పుడు అందరూ సామాజిక మాధ్యమాలను..

Crime: పచ్చని సంసారం లో రీల్స్ చిచ్చు.. భార్య అలా చేయడం ఇష్టం లేక.. గొంతు నులిమి దారుణంగా..
Crime News
Follow us on

సోషల్ మీడియా.. ఈ రెండు పదాలు చాలు.. యావత్ ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేస్తున్నాయి. అందరికీ సెల్ ఫోన్లు అందుబాటులోకి రావడం, అందుబాటులో ఉండే డేటా ప్యాకేజీలతో ఇప్పుడు అందరూ సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటున్నారు. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు క్షణం తీరిక లేకుండా సోషల్ మీడియాలో బిజీ అయిపోతున్నాయి. చిన్నా పెద్దా ఆడా మగా అనే తేదా లేకుండా అందరూ ఫోన్లలో కాలం గడిపేస్తున్నారు. అయితే.. ఈ మధ్య కాలంలో ఇన్ స్టా గ్రామ్ లో రీల్స్, యూ ట్యూబ్ లో షార్ట్స్ విశేష ఆదరణ పొందుతున్నాయి. తక్కువ వ్యవధిలో ఉండే వీడియోలను చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది తమలోని నైపుణ్యాలను బయట పెట్టేందుకు రీల్స్ చేస్తున్నారు. అయితే ఇవి కొందరికి ఆనందం కలిగిస్తున్నా.. మరికొందరికి మాత్రం దుఖాన్ని మిగుల్చుతున్నాయి. భార్య రీల్స్ చేయడం ఇష్టం లేకపోవడంతో ఓ వ్యక్తి గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహం వద్దే రాత్రంతా కూర్చున్నాడు. బిహార్ లోని నవాడా ప్రాంతంలో నివాసముండే అన్నూ ఖాతూన్​కు అనిల్​తో పదేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లయిన కొన్ని రోజులకే వీళ్లిద్దరి మధ్య మనస్ఫర్థలు వచ్చాయి. దీంతో ఇద్దరూ వేరుగా ఉన్నారు. అయితే వీరి విషయంలో పెద్ద మనుషులు కలగజేసుకుని సయోధ్య కుదిర్చారు. దీంతో దంపతులు మళ్లీ కొంతకాలంగా కలిసి ఉంటున్నారు.

ఈ క్రమంలో భార్య అన్నూ సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఉండేది. ఆమె అలా చేయడం భర్త అనిల్ కు నచ్చలేదు. రీల్స్ చేయడం మానుకోవాలని కోరాడు. దీనికి ఆమె వ్యతిరేకించడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఒకరోజు అనిల్ కు భార్యపై తీవ్ర కోపం వచ్చింది. ఫోన్ లో ఉన్న యాప్స్ ను డిలీట్ చేయాలంటూ ఘర్షణకు దిగాడు. ఈ సమయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. కోపంలో అనిల్ అన్నూ గొంతు నులిమి హత్య చేశాడు. ఉదయం రూమ్ క్లీన్ చేసేందుకు వెళ్లిన కుటుంబసభ్యులు అనిల్, అన్నూ గదికి లోపల నుంచి తాళం వేసి ఉండటాన్ని గమనించారు. వెంటనే ఇతరులను పిలిచారు. దీంతో వారు అక్కడికి వచ్చారు. ఎంత తలుపు కొట్టినా తీయకపోయోసరికి తలుపులు విరగ్గొట్టారు. గదిలో ఉన్న దృశ్యాలను చూసి వారు అవాక్కయ్యారు. అన్నూ విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి అందరూ విస్తుపోయారు. మృతదేహం పక్కనే అనిల్ కూర్చుని ఉన్నాడు. అతనిని ఏం జరిగిందని అడగగా.. తానే భార్యను హత్య చేసినట్లు చెప్పాడు.

ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. నిందితుడు అనిల్​ను అదుపులోకి తీసుకున్నారు. అయితే.. అతడిని విచారించిన సమయంలో షాకింగ్ విషయాలు తెలిశాయి. తన భార్య వీడియోలను స్నేహితులు, సన్నిహితులు చూసి హేళన చేసేవారని, వీడియోలు చేయడం ఆపేయాలని చాలాసార్లు హెచ్చరించినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదని, అందుకే చంపేసినట్లు పోలీసులు దర్యాప్తులో అనిల్ ఒప్పుకున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..