Watch: 5 లక్షల కోసం ఇంటిని తగలబెట్టడం ఏందిరా.. బెంగళూరులో షాకింగ్ ఘటన

అప్పు తిరిగివ్వమన్నందుకు ఓ వ్యక్తి దారుణ ఘటనకు పాల్పడ్డాడు. అప్పు ఇచ్చిన వారి ఇంటికి వెళ్లి పెట్రోల్ పోసి ఆ ఇంటిని తగలబెట్టాడు. ఈ షాకింగ్ ఘటన బెంగళూరులో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Watch: 5 లక్షల కోసం ఇంటిని తగలబెట్టడం ఏందిరా.. బెంగళూరులో షాకింగ్ ఘటన
Bengaluru House

Updated on: Jul 04, 2025 | 11:11 AM

మనుషులు కొన్నిసార్లు ఎంతకైన తెగిస్తారు. చిన్న విషయాలకే దారుణమైన ఘటనలకు పాల్పడుతుంటారు. బెంగళూరులో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ వ్యక్తి 5 లక్షల అప్పు కోసం బంధువుల ఇంటిని తగలబెట్టడానికి ప్రయత్నించాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ పుటేజీ నెట్టింట వైరల్‌ గా మారింది. బెంగళూరులోని వివేక్ నగర్‌లో బంధువుల మధ్య చాలా కాలంగా కొనసాగుతున్న అప్పు గొడవ ప్రమాదకర ఘటనకు దారితీసింది. అసలేం జరిగిందంటే.. వెంకటరమణి కుటుంబం దగ్గర వారి బంధువైన పార్వతి తన కూతురు పెళ్లి కోసం రూ.5లక్షల అప్పు తీసుకుంది. అప్పు తీసుకుని 8ఏళ్లు దాటినా వారు తిరిగి చెల్లిచలేదు. అప్పటినుంచి రెండు ఫ్యామిలీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమనేలా గొడవులు నడుస్తున్నాయి. ఇటీవల ఓ పెళ్లి వేడుకలో కలిసిన పార్వతిని వెంకటరమణి రూ.5లక్షలు తిరిగివ్వాలని అడిగింది. ఈ క్రమంలో వారి కుటుంబాన్ని తిడుతూ అవమానించింది. దీంతో కోపంతో రగిలిపోయిన పార్వతి కుటుంబం దారుణమైన ఘటనకు ఒడిగట్టింది.

ఈ నేపథ్యంలోనే పార్వతి కుటుంబానికి చెందిన సుబ్రమణి అనే వ్యక్తి వెంటకరమణి ఇంటికి నిప్పంటించడం సంచలనంగా మారింది. ఈ ఘటన జరిగినప్పుడు వెంకటరమణి అతని సోదరుడితో కలిసి ఇంట్లోనే ఉంది. వెంటనే తన కొడుకు సతీష్ కు ఫోన్ చేసి ఎవరో ఇంట్లోకి ప్రవేశించారని భయాందోళన వ్యక్తం చేసింది. ఇంతలోనే సుబ్రమణి ఇంటి డోర్, కిటికీలపై పెట్రోల్ పోసి నిప్పంటిచాడు. వెంటనే అప్రమత్తమైన చుట్టుపక్కలవారు మంటలను ఆర్పివేసి ఇంట్లో ఉన్నవారిని రక్షించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయం కాలేదు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కాగా ఘటనపై వెంకటరమణి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..