
ఓ మహిళ ఐస్‌క్రీమ్ కొనుగోలు చేసి దాన్ని తినగా అందులో బల్లి తోక దర్శనమిచ్చిన ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అహ్మాబాద్‌లోని మణినగర్ ప్రాంతంలో ఉన్న ఓ ఐస్‌క్రీం షాప్‌కు వెళ్లిన మహిళ.. తన పిల్లల కోసం నాలుగు కోన్ ఐస్‌క్రీమ్‌లు తీసుకుంది. అయితే సగం ఐస్‌క్రీం తిన్న తరువాత ఆమెకు దానిలో బల్లి తోక భాగం దర్శనమిచ్చింది. అయితే ఐస్‌క్రీం తిన్న కొద్దిసేపటి తర్వాత తాను అనారోగ్యానికి గురైనట్టు ఆమె ఓ వీడియోలో తెలిపింది. తర్వాత ఆమె హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స తీసుకుంది.
ఇక తనకు నాణ్యతలేని ఐస్‌క్రీమ్స్ అమ్మిన షాప్‌పై మహిళ అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌కు ఫిర్యాదు చేసింది. బాధిత మహిళ ఫిర్యాదును పరగణనలోకి తీసుకున్న అధికారులు ఆ షాప్ నిర్వాహకులపై చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా
మహిళకు ఐస్‌క్రీమ్‌లు విక్రయించిన షాప్‌కు ఫుడ్ సేఫ్టీ లైసెన్స్‌లు లేనట్టు గుర్తించింది. దీంతో ఆ షాప్‌ను అధికారులు క్లోజ్ చేయించారు.
AMC seals ice cream parlour after customer claims finding a lizard in Havmor conehttps://t.co/ELLXxJvkcT pic.twitter.com/W5WYwwBnVF
— DeshGujarat (@DeshGujarat) May 14, 2025
దీంతో పాటు ఆమె తిన్న ఐస్‌క్రీం ఏం కంపెనీకి సంబంధించిందో అనే వివరాలపై ఆరా తీశారు. దాని తయారీ కంపెనీ నరోడా GIDC ఫేజ్ 1లో ఉందని గుర్తించారు. ఆ కంపెనీకి సంబంధించిన ఐస్‌క్రీమ్‌లను ల్యాబ్‌కు పంపించారు. వాటి రిపోర్ట్స్ ఆధారంగా కంపెనీ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. ఆ కంపెనీపై రూ. 50,000 జరిమానా విధించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..