Jharkhand: ప్రేమను నిరూపిస్తానని సవాల్ విసిరి.. బాలికకు మాయమాటలు చెప్పి.. పోలీసుల ఎంట్రీతో మారిన సీన్..

|

Sep 20, 2022 | 4:37 PM

ఓ బాలికతో కొందరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వారి మధ్య ఎట్రాక్షన్ కు దారి తీసింది. అయితే.. ఈ విషయమై కొందరు యువకుల మధ్య గొడవ జరిగింది. బాలిక తననే ప్రేమిస్తోందంటూ ఇద్దరు ఘర్షణకు దిగారు...

Jharkhand: ప్రేమను నిరూపిస్తానని సవాల్ విసిరి.. బాలికకు మాయమాటలు చెప్పి.. పోలీసుల ఎంట్రీతో మారిన సీన్..
child harassment
Follow us on

ఓ బాలికతో కొందరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వారి మధ్య ఎట్రాక్షన్ కు దారి తీసింది. అయితే.. ఈ విషయమై కొందరు యువకుల మధ్య గొడవ జరిగింది. బాలిక తననే ప్రేమిస్తోందంటూ ఇద్దరు ఘర్షణకు దిగారు. తమ ప్రేమను నిరూపిస్తానని ఓ యువకుడు సవాల్ విసిరాడు. అంతటితో ఆగకుండా చేసిన సవాల్ ప్రకారం బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబసభ్యులు యువకుడిపై పోలీసులకు కంప్లైంట్ చేశారు. జార్ఖండ్ లోని కోయలంచల్ ధన్​బాద్ ప్రాంతానికి చెందిన కొందరు యువకుల మధ్య గొడవ జరిగింది. ఓ మైనర్ విషయమై వీరి మధ్య వాగ్వాదం జరిగింది. బాలిక తనను ప్రేమిస్తోందని ఒక యువకుడు చెప్పాడు. అయితే ఆ బాలిక తననే ప్రేమిస్తోందని మరో యువకుడు చెప్పడంతో గొడవ మొదలైంది. మాటామాటా పెరిగి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఆ అమ్మాయి తనను మాత్రమే ప్రేమిస్తోందని.. ఎవరూ అడ్డు రావొద్దని చెప్పాడు. కాదని వస్తే అంతు చూస్తామని వార్నింగ్ ఇచ్చుకున్నారు. ఈ విషయాన్ని నిరూపిస్తానని సంజయ్ తన స్నేహితులకు సవాల్ విసిరాడు. ఆధారాలు కూడా చూపిస్తానని వారితో చెప్పాడు.

స్నేహితులకు ఛాలెంజ్ చేసిన తర్వాతి రోజే మైనర్​కు మాయమాటలు చెప్పి తనతో తీసుకెళ్లాడు. పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘాతుకాన్ని ఫోన్​లో రికార్డు చేశాడు. బాలికతో ప్రేమలో ఉన్నాననేందుకు ఇదే రుజువు అని వీడియోను స్నేహితులకు పంపించాడు. అతని స్నేహితులు మాత్రం ఈ వీడియోను బాలిక బంధువులకు చూపించారు. వారు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్ తీరుపై మండిపడుతూ పోలీసులను ఆశ్రయించారు. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితుల కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు సంజయ్​ను అరెస్టు చేశారు. అనంతరం జైలుకు పంపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..