అదృష్టం అంటే ఆ రైతుదే.. కేవలం రెండు వందల రూపాయలతో లక్షాధికారి అయ్యాడు.. ఎలాగో తెలుసా?

పాపం ఆ రైతు కష్టం చూసి దేవుడు కరుణించినట్లున్నాడు. అందుకే అతడికి ఓ వరం ప్రసాదించాడు. కేవలం రూ.200 రూపాయల

అదృష్టం అంటే ఆ రైతుదే.. కేవలం రెండు వందల రూపాయలతో లక్షాధికారి అయ్యాడు.. ఎలాగో తెలుసా?

Updated on: Dec 07, 2020 | 10:03 PM

పాపం ఆ రైతు కష్టం చూసి దేవుడు కరుణించినట్లున్నాడు. అందుకే అతడికి ఓ వరం ప్రసాదించాడు. కేవలం రూ.200 రూపాయల పెట్టుబడితో లక్షాధికారిని చేశాడు. అదేంటి రెండు వందలతో ఎలా లక్షాధికారి అయ్యాడనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ వైపు ఓ లుక్కేయండి..

మద్యప్రదేశ్ రాష్ట్రంలోని పన్నాకు చెందిన రైతు లఖన్ యాదవ్ గత నెలలో రూ.రెండు వందల రూపాయలు చెల్లించి వ్యవసాయం చేయడం కోసం కొంత భూమిని లీజుకు తీసుకున్నాడు. దానిని సాగు చేస్తున్నక్రమంలో గులకరాయిని పోలిన ఓ రాయి మెరుస్తూ కనిపించింది. అనుమానం వచ్చిన రైతు దానిని తీసుకొని దగ్గర పెట్టుకొని, ఇంటికి వెళ్లాక గ్రామంలోని వజ్రాల వ్యాపారికి చూపించాడు. దీంతో అతడు చెప్పిన విషయం విన్న రైతు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అది రాయి కాదని 14.98 క్యారెట్ల వజ్రం అని, దీని విలువ సుమారు రూ.60 లక్షలు ఉంటుందని చెప్పాడు. దీంతో లఖన్ యాదవ్ ఆనందంతో ఉప్పొంగిపోయాడు. ఆ డబ్బులను మా పిల్లల చదువుకు ఉపయోగిస్తానని తెలిపాడు. ఎందుకంటే తాను చదువుకోలేదని, చదువు విలువ నాకు బాగా తెలుసని, తనలా తన పిల్లలు మారొద్దని అన్నాడు. అందుకే ఈ డబ్బును వాడి తన పిల్లలను ప్రయోజకులను చేస్తానని తెలిపాడు.