విషాదం.. వరదలో కొట్టుకుపోయిన గజరాజు

కేరళలో భారీ వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఏర్నాకులం జిల్లాలో కురుస్తున్న వర్షాల ధాటికి వరదలు..

విషాదం.. వరదలో కొట్టుకుపోయిన గజరాజు

Edited By:

Updated on: Aug 07, 2020 | 6:37 AM

కేరళలో భారీ వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఏర్నాకులం జిల్లాలో కురుస్తున్న వర్షాల ధాటికి వరదలు తీవ్ర రూపాన్ని దాల్చుతున్నాయి. ఈ క్రమంలో ఓ ఏనుగు వరద నీటిలో కొట్టుకుపోయింది. ఈ సంఘటన జిల్లాలోని నేరిమంగళం ప్రాంతంలో గురువారం చోటుచేసుకుంది. వరద నీరు అకస్మాత్తుగా పెరగడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్థమవుతోంది.

కాగా, వయనాడ్, పనమరంలో గురువారం నాడు భారీ వర్షాలు కురిశాయి. దీంతో సమీప ప్రాంతాల్లోని నదులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.

Read More :

దేశ రాజధానిలో పెరిగిన కరోనా కేసులు

మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు