మరీ ఇంత దారుణమా..! రెస్టారెంట్‌లో మాడిపోయిన రొట్టె ఇచ్చారని..

|

Dec 16, 2024 | 5:56 PM

ఢిల్లీ ఎన్‌సీఆర్‌లోని సైబర్ సిటీలోని ఓ రెస్టారెంట్‌లో ఆదివారం రాత్రి రెండు వర్గాల మధ్య భారీ ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఓ కారు కాలిబూడిదైంది.

మరీ ఇంత దారుణమా..! రెస్టారెంట్‌లో మాడిపోయిన రొట్టె ఇచ్చారని..
Car Fire
Follow us on

ఢిల్లీ శివారులోని గుర్‌గ్రామ్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాడిపోయిన రొట్టె ఇచ్చారని రెస్టారెంట్‌ సిబ్బందితో కొందరు కస్టమర్లు ఘర్షణకు దిగారు. దీంతో ఇరువర్గాలు రెచ్చిపోయాయి.. రెస్టారెంట్‌ బయట ఉన్న కారును తగలబెట్టడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

ఢిల్లీ ఎన్‌సీఆర్‌లోని సైబర్ సిటీలోని ఓ రెస్టారెంట్‌లో ఆదివారం(డిసెంబర్ 15) రాత్రి రెండు వర్గాల మధ్య భారీ ఘర్షణ జరిగింది. ఆ తర్వాత దుండగులు వాహనానికి నిప్పు పెట్టారు. తెల్లవారుజామున అక్కడికి వెళ్లిన జనాల్లో ఆందోళన నెలకొంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. శివ్‌జీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ గొడవపై తమకు సమాచారం అందిందని కేసు విచారణ చేస్తున్న అధికారి పదం కిషోర్ తెలిపారు.

మరిన్ని క్రైౌమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..