79th Independence Day: అక్షర్‌ధామ్ ప్రాంగణంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఢిల్లీలోని స్వామినారాయణ అక్షర్‌దామ్ ఆవరణలో ఆగస్టు 15 ఉదయం సూర్యకిరణాల వెలుగులో కేశర, తెలుపు, ఆకుపచ్చ రంగుల జెండా రెపరెపలాడుతుండగా, అక్కడి ప్రతి హృదయం గర్వంతో పొంగిపొర్లింది. అక్షర్‌దామ్ పరిసరాలు దేశభక్తి రాగాలతో మార్మోగాయి. గత తరం వీరుల త్యాగాలను స్మరించుకుంటూ, రాబోయే తరాల కలలతో ఈ వేడుకలు ప్రతిధ్వనించాయి.

79th Independence Day: అక్షర్‌ధామ్ ప్రాంగణంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Independence Day at Akshardham

Edited By: TV9 Telugu

Updated on: Aug 18, 2025 | 12:00 PM

న్యూఢిల్లీలోని స్వామినారాయణ అక్షర్‌ధామ్ ప్రాంగణం ఆగస్టు 15, శుక్రవారం ఉదయం త్రివర్ణ పతాకంతో అలరారింది. ఆకాశంలో ఎగిరిన జాతీయ పతాకం చూసి, అక్కడ ఉన్న ప్రతి హృదయంలో దేశభక్తి గర్వం నిండిపోయింది. BAPS అంతర్జాతీయ సమన్వయకర్త పూజ్య ఈశ్వర్‌చరణ్ స్వామిజీ స్వయంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, సెల్యూట్ చేసి, దేశానికి తన వందనం అర్పించారు.  దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన వారిని మరువకూడదు. స్వేచ్ఛ కేవలం బహుమతి కాదు.. అది బాధ్యత అని ఆయన అన్నారు. గత తరం వీరుల త్యాగాలను స్మరించుకుంటూ, రాబోయే తరాల కలలతో ఈ వేడుకలు ప్రతిధ్వనించాయి.

దేశభక్తి గీతాల స్వరాలు, ఉత్సాహభరితమైన పరేడ్, ప్రేరణ నింపిన సందేశాలతో ఈ వేడుకల ప్రాంగణం ఉత్సవ వేడుకను సంతరించుకుంది. మతం, భాష, ప్రాంతం అనే భేదాలను మరచి, మనమందరం భారతీయులమే అన్న ఒకే భావంతో అందరూ ఒక్కటయ్యారు. ఈ వేడుకలు కేవలం జాతీయ పతాక ఆవిష్కరణ కాదని, స్వాతంత్ర్య స్ఫూర్తిని హృదయాల్లో మరింత బలంగా నాటే క్షణాలని అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ భావించారు. చివరగా స్వామిజీ అందరికీ శాంతి, ఐక్యత, సేవ అనే విలువలను జీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు.