Jan Dhan Yojana: జన్‌ ధన్‌ యోజన పథకానికి ఏడేళ్లు పూర్తి.. ఎంత మంది లబ్ది పొందారో తెలుసా..?

|

Aug 28, 2021 | 3:13 PM

Jan Dhan Yojana: ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన.. దేశ ప్రజలందరికీ సుపరిచితమైన పేరు ఇది. ఈ పథకం ద్వారా ఎంతో ప్రయోజనాలు తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం..

Jan Dhan Yojana: జన్‌ ధన్‌ యోజన పథకానికి ఏడేళ్లు పూర్తి.. ఎంత మంది లబ్ది పొందారో తెలుసా..?
Jan Dhan Yojana
Follow us on

Jan Dhan Yojana: ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన.. దేశ ప్రజలందరికీ సుపరిచితమైన పేరు ఇది. ఈ పథకం ద్వారా ఎంతో ప్రయోజనాలు తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ తొలి విడత సంకీర్ణ ప్రభుత్వం అమలు చేసిన కొన్ని కీలకమైన పథకాల్లో ఇదీ ఒకటి. దిగువ మధ్య తరగతి, పేద కుటుంబాలకు చెందిన వారు జీరో బ్యాలెన్స్‌తో బ్యాంకుల్లో అకౌంట్లను తెరవడానికి ఉద్దేశించిన స్కీమ్. ఒకరకంగా నరేంద్ర మోడీ మానస పుత్రికగా దీనిని చెప్పుకోవచ్చు.

బ్యాంకింగ్ సెక్టార్ పరిధిలోకి కోట్లమంది..

కోట్లాదిమంది దేశ ప్రజలను బ్యాంకింగ్ సెక్టార్ పరిధిలోకి తీసుకొచ్చిన ఒకే ఒక్క వ్యవస్థ ఇది. అప్పటిదాకా బ్యాంకుల గురించి పెద్దగా తెలియని, పరిచయం లేని పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు కోట్లాదిమంది ఈ పథకం కింద జీరో బ్యాలెన్స్‌తో అకౌంట్లను ఓపెన్ చేసుకున్నారు.

ఈ పథకానికి నేటితో ఏడేళ్లు పూర్తి..

ఈ పథకం ప్రవేశపెట్టి ఆగస్టు 28తో ఏడేళ్లు పూర్తి చేసుకుంది. ఏడేళ్ల కిందట సరిగ్గా ఇదే రోజు ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం అమల్లోకి వచ్చింది. ఈ ఏడు సంవత్సరాల వ్యవధిలో 43 కోట్ల 04 లక్షల మంది ప్రజలు బ్యాంకుల్లో తమ అకౌంట్లను ఓపెన్‌ చేసుకున్నారు. ఈ 43 కోట్ల మంది ఈ ఏడు సంవత్సరాల్లో తమ అకౌంట్లలో 1,46,231 కోట్ల రూపాయలను డిపాజిట్ చేసుకున్నారు.

అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే జన్‌ ధన్‌ పథకం..

అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే.. జన్ ధన్ పథకం ప్రారంభమై ఏడు సంవత్సరాలయిన సందర్భంగా ఈ గణాంకాలన్నింటినీ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన తొలి సంవత్సరంలోనే ఈ పథకం అమల్లోకి వచ్చింది. దేశ ప్రజల సంక్షేమం, వారికి ఆర్థిక పరిపుష్టిని కలిగించడానికి జన్ ధన్ పథకాన్ని అమలు చేస్తామని 2014 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రెడ్ ఫోర్ట్ వేదికగా నరేంద్ర మోడీ ప్రకటించారు. ప్రధాని ఆశయాలకు అనుగుణంగా.. అదే సంవత్సరం ఆగస్టు 28వ తేదీన ఈ పథకం కార్యరూపం దాల్చింది. ఇది దేశవ్యాప్తంగా అమలు అయింది. ఏడేళ్లు పూర్తి చేసుకుంటోన్న సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్మల సీతారామన్, ఆ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవంత్ కృష్ణారావు కరద్ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రధాని మోడీ అకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా ఈ పథకాన్ని అమలు చేశామని, ఆది తన లక్ష్యాన్ని అందుకుందని అన్నారు.

 

ఇవీ కూడా చదవండి:

e-Shram Portal: వారి కోసం కేంద్రం అదిరిపోయే బెనిఫిట్.. ఈ కార్డుతో రూ.2 లక్షల వరకు ప్రయోజనం..!

Bharat Bandh: సెప్టెంబర్‌ 25న భారత్‌ బంద్‌.. ప్రకటించిన నేతలు.. ఎందుకో తెలుసా..?