చావు తెలివితేటలంటే ఇవే..! 61 కేజీల బంగారంతో ముంబై విమానాశ్రయం చేరుకున్న ప్రయాణికులు.. కట్ చేస్తే..

|

Nov 14, 2022 | 5:50 AM

ఎయిర్‌పోర్టులు గోల్డ్‌ స్మగ్లింగ్‌కు అడ్డాలుగా మారుతున్నాయ్‌. శంషాబాద్‌, చెన్నై, కోల్‌కతా, ముంబై, ఢిల్లీ.. అన్ని ఎయిర్‌పోర్ట్స్‌లోనూ పెద్దఎత్తున గోల్డ్‌ స్మగ్లింగ్‌ జరుగుతోంది. బంగారం అక్రమ రవాణాకు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తున్నారు స్మగ్లర్స్‌.

చావు తెలివితేటలంటే ఇవే..! 61 కేజీల బంగారంతో ముంబై విమానాశ్రయం చేరుకున్న ప్రయాణికులు.. కట్ చేస్తే..
Gold
Follow us on

ఎయిర్‌పోర్టులు గోల్డ్‌ స్మగ్లింగ్‌కు అడ్డాలుగా మారుతున్నాయ్‌. శంషాబాద్‌, చెన్నై, కోల్‌కతా, ముంబై, ఢిల్లీ.. అన్ని ఎయిర్‌పోర్ట్స్‌లోనూ పెద్దఎత్తున గోల్డ్‌ స్మగ్లింగ్‌ జరుగుతోంది. బంగారం అక్రమ రవాణాకు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తున్నారు స్మగ్లర్స్‌. అయితే, ఎన్ని జిమ్మిక్కులు చేసినా గోల్డ్‌ స్మగ్లర్స్‌కి చెక్‌ పెడుతున్నారు కస్టమ్స్‌ అధికారులు. లేటెస్ట్‌గా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో 61 కేజీల గోల్డ్ పట్టుబడింది. UAE నుంచి వచ్చిన నలుగురు ప్రయాణికుల నుంచి.. దుబాయ్‌ నుంచి వచ్చిన ముగ్గురు ప్యాసింజర్స్‌ నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ ఏడుగురు కూడా గోల్డ్‌ స్మగ్లింగ్‌కి చావు తెలివితేటలు ఉపయోగించారు. స్పెషల్‌గా బెల్ట్‌లు తయారు చేయించి బంగారం స్మగ్లింగ్‌కి ప్రయత్నించారు. అయితే, కస్టమ్స్‌ అధికారుల ముందు వీళ్ల ఆటలు సాగలేదు.

పట్టుబడిన 61 కేజీల బంగారం విలువ 32 కోట్ల రూపాయలుంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేశారు. అంతేకాదు, ఇంత పెద్ద మొత్తంలో బంగారం పట్టుబడటం ఇదే ఫస్ట్‌టైమ్‌ అంటున్నారు కస్టమ్స్‌ అధికారులు. దుబాయ్‌ నుంచే గోల్డ్‌ స్మగ్లింగ్‌ జరుగుతుండటంతో, అక్కడ్నుంచి వస్తోన్న ప్రయాణికులపై ప్రత్యేక దృష్టిపెడుతున్నారు పోలీసులు. ఇప్పుడు ముంబై ఎయిర్‌పోర్ట్‌లో పట్టుబడిన ఏడుగురిలో ముగ్గురు దుబాయ్‌ నుంచి వచ్చినవాళ్లే కాగా, నిందితుల్లో మహిళలు కూడా ఉండటం షాక్‌కి గురిచేస్తోంది. నిందితులందరూ దోహా మీదుగా ముంబై వచ్చినట్లు గుర్తించారు అధికారులు. దోహా ఎయిర్‌పోర్ట్‌లోనే గోల్డ్‌ బిస్కెట్స్‌ ఉన్న బెల్ట్‌ను సూడాన్‌ జాతీయుడు వీళ్లకు ఇచ్చినట్లు తెలుస్తోంది. దాంతో, అసలు, ఈ గోల్డ్‌ ఎవరి కోసం తీసుకొచ్చారు? దీని వెనక ఉన్నదెవరో కనిపెట్టేందుకు అధికారులు ఇంటరాగేట్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

పట్టుబడిన ఏడుగురు ప్రయాణికుల్లో ఐదుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారని కస్టమ్స్ అధికారులు తెలిపారు. మొదటి ఆపరేషన్‌లో, టాంజానియా నుంచి తిరిగి వస్తున్న నలుగురు భారతీయులు 1 కిలోల బంగారు కడ్డీలను తీసుకువచ్చినట్లు గుర్తించారు. వీటిని ప్రత్యేకంగా రూపొందించిన బెల్ట్‌లలో, జీన్స్ పాయింట్లలో ఉంచారని తెలిపారు. వారందరినీ అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు చెప్పారు. ముంబై కస్టమ్స్ అధికారులు భారీ ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకోవడంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశంసించారు. మీ సమయానుకూల చర్య అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చిందంటూ ప్రశంసించారు.

జాతీయ వార్తల కోసం..