Gujarat Coast: సముద్ర జలాల్లో పట్టుపడిన పాక్ ఫిషింగ్ బోట్.. పడవలోకి వెళ్లిన పోలీసులకు భారీ షాక్..

|

Sep 14, 2022 | 1:03 PM

Drug Bust: గుజరాత్‌లోకి భారీ ఎత్తున డ్రగ్స్‌ను తరలించేందుకు జరిగిన కుట్రను వీరు ఛేదించారు. గుజరాత్ ATS (Gujarat ATS), ఇండియన్ కోస్ట్ గార్డ్ బృందం సంయుక్తంగా ఈ కుట్రను బ్రేక్ చేశారు.

Gujarat Coast: సముద్ర జలాల్లో పట్టుపడిన పాక్ ఫిషింగ్ బోట్.. పడవలోకి వెళ్లిన పోలీసులకు భారీ షాక్..
Gujarat Coast
Follow us on

గుజరాత్ తీరంలో రూ. 200 కోట్ల విలువైన డ్రగ్స్‌ను తరలిస్తున్న ఆరుగురు పాకిస్తానీ జాతీయులను పట్టుకున్నారు గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS). జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా వీరిని పట్టుకున్నారు. కచ్ జిల్లాలోని జఖౌ నౌకాశ్రయానికి సమీపంలో కోస్ట్ గార్డ్ , ATS పోలీసులు జాయింట్ ఆపరేషన్‌ నిర్వహించింది. డ్రగ్స్‌తో వెళ్తున్న ఫిషింగ్ బోట్‌ను సముద్రం మధ్యలో అడ్డగించిందని అధికారి తెలిపారు. వీరు నుంచి సుమారు 40 కిలోల హెరాయిన్‌ను తీసుకెళ్తున్నట్లుగా గుర్తించారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కచ్ పోలీసులకు అప్పగించారు. అలాగే, డ్రగ్స్‌తోపాటు 6గురు పాకిస్తానీయులను అరెస్టు చేశారు. పంజాబ్ జైలులో వున్న నైజీరియన్ ఈ డ్రగ్స్‌ను ఆర్డర్ ఇచ్చినట్లు వెల్లడైంది. ఈ నైజీరియన్ వ్యక్తి పంజాబ్ జైలు నుంచే డ్రగ్స్ నెట్‌వర్క్ నడుపుతున్నట్లు తేలింది. ప్రస్తుతం గుజరాత్ పోలీసులు, ఏటీఎస్, కోస్ట్ గార్డ్ తీరప్రాంతాల్లో బృందాలు గట్టి నిఘా పెంచి.. నిశితంగా పరిశీలిస్తున్నారు.

గుజరాత్ ఏటీఎస్ భారీ విజయం..

గుజరాత్ ఏటీఎస్ సాధించిన భారీ విజయంగా అధికారులు అభివర్ణించారు.  ATS, కోస్ట్ గార్డ్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ IMBL పేరుతో కొనసాగుతోంది. వీరు సరిహద్దుల ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్న మాఫియాను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు. ఇప్పటి వరకు దాదాపు 3600 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం