Operation Sindoor: ఆపరేషన్‌ సింధూర్‌.. కీలక ఉగ్రనేతల హతం.. ఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన

ఉగ్రవాదంపై పోరాడుతున్న భారత్‌కు గొప్ప విజయం లభించింది. ఆపరేషన్‌ సింధూర్‌లో కీలక ఉగ్రవాద నేతలు హతం అయ్యారు. ఉగ్రవాదులను అంతం చేయడానికే ఈ దాడులు చేశామన్న భారత్‌.. తిరుగులేని ఆధారాలను వెల్లడించింది. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం.. భారత్ మే 7న జరిగిన ఆపరేషన్‌ సింధూర్‌ ను ప్రారంభించింది..

Operation Sindoor: ఆపరేషన్‌ సింధూర్‌.. కీలక ఉగ్రనేతల హతం.. ఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన
Operation Sindoor

Updated on: May 10, 2025 | 3:28 PM

ఉగ్రవాదంపై పోరాడుతున్న భారత్‌కు గొప్ప విజయం లభించింది. ఆపరేషన్‌ సింధూర్‌లో కీలక ఉగ్రవాద నేతలు హతం అయ్యారు. ఉగ్రవాదులను అంతం చేయడానికే ఈ దాడులు చేశామన్న భారత్‌.. తిరుగులేని ఆధారాలను వెల్లడించింది. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం.. భారత్ మే 7న జరిగిన ఆపరేషన్‌ సింధూర్‌ ను ప్రారంభించింది.. ఈ ఆపరేషన్‌లో కీలకమైన 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిగాయి. పాకిస్తాన్, పీఓకే భూభాగంలోని కీలకమైన మురిడ్కే, బహవల్పూర్, సియాల్కోట్, చకంబ్రూ, కోట్లీ, గుల్పూర్, భీంబర్ ప్రాంతాల్లోని ఉగ్రవాద స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడింది. అయితే.. ఈ దాడుల్లో టాప్‌ టెర్రరిస్టులు హతమయ్యారు..

కరుడుగట్టిన ఐదుగురు ఉగ్రవాదులు మరణించినట్టు శనివారం ఇండియన్‌ ఆర్మీ ప్రకటించింది. మరణించినవారిలో ముగ్గురు జైషే మహ్మద్‌.. ఇద్దరు లష్కరే టెర్రరిస్టులుగా ఉన్నట్టు వెల్లడించింది. అంతేకాదు, చనిపోయినవారిలో జైషే చీఫ్‌‌ మసూద్‌ అజర్‌ బంధువులు కూడా ఉన్నారు. హతమైన ఉగ్రవాదుల్లో ముంబై 26/11 దాడుల నిందితుడు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

మే 7న జరిగిన ఆపరేషన్‌ సింధూర్‌లో హతమైన టెర్రరిస్టుల పేర్లు ఇవే..

1. ముదస్సర్‌ ఖాదియాన్‌ ఖాస్‌ అలియాస్‌ అబూ జుందాల్.. ఇతను లష్కరే తోయ్యిబా టెర్రరిస్ట్‌

2. హఫీజ్‌ మొహ్మద్‌ జమాల్.. ఇతను జైషే మహ్మద్‌ ఉగ్ర గ్రూప్‌.. మసూద్‌ అజర్‌కి ఇతను పెద్ద బావమరిది

3. మహ్మద్‌ యూసుఫ్‌ అజార్‌ అలియాస్‌ ఉస్తాద్‌జీ అలియాస్‌ ఘౌసిసాబ్‌.. ఇతనిది కూడా జైషే గ్రూపే.. అంతేకాదు మసూద్‌ అజర్‌కి మరో బావమరిది ఇతను..

4. ఖలీద్‌ అలియాస్‌ అబూ అఖాస.. ఇతను లష్కరే ఉగ్రవాది.. జమ్మూకశ్మీర్‌లో జరిగిన అనేక ఉగ్రదాడుల్లో నిందితుడు..

5. మహ్మద్‌ హసన్‌ఖాన్‌.. జైషే మహ్మద్‌ ఉగ్రసంస్థ ఉగ్రవాది.. పీవోకేలో జైషే గ్రూప్‌కి కమాండర్‌గా ఉన్నాడు.

వీళ్లంతా మే 7న జరిగిన ఆపరేషన్‌ సింధూర్‌లో హతమయ్యారని ప్రకటించింది. వీరితో పాటు పలువురు ఉగ్రవాదలు హతమైనట్లు వెల్లడించింది.

పాక్ పెద్ద ఎత్తున అవాస్తవాలు ప్రచారం చేస్తోంది: విదేశీ వ్యవహారాలశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ

భారత్‌పై తాము అనేక దాడులు చేశామంటూ పాక్ పెద్ద ఎత్తున అవాస్తవాలు ప్రచారం చేస్తోందన్నారు విదేశీ వ్యవహారాలశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ. సిర్సాలో ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్, అదంపూర్‌లో ఎస్‌-400 బేస్, విద్యుత్, సైబర్, మౌలిక వ్యవస్థలను తాము ధ్వంసం చేశామని పాక్ అవాస్తవాలను ప్రచారం చేస్తోందన్నారు. భారత్‌ మిస్సైల్స్‌ ఆఫ్గానిస్తాన్‌ టార్గెట్ చేశాయనే ప్రచారంలోనూ ఎలాంటి నిజం లేదని వివరించారు.

కాగా.. మే 7వ తేదీ దాడిలో తన కుటుంబ సభ్యులు పదిమందిని కోల్పోయినట్లు ఇంతకుముందే కీలక ఉగ్రనేత మసూద్ అజహర్ పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ సింధూర్ లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని ఇటీవల జరిగిన అఖిల పక్ష సమావేశంలో రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..