Road Accident: గంగా నదిలో అస్తికలు కలిపి వస్తుండగా ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం..

జైపూర్‌ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి మరణించడంతో.. అతని అస్థికలను గంగా నదిలో కలిపేందుకు హరిద్వార్ వెళ్లారు. అక్కడి నుంచి జైపూర్ వెళ్తుంగా.. రేవరిలో ఈ ప్రమాదం జరిగింది.

Road Accident: గంగా నదిలో అస్తికలు కలిపి వస్తుండగా ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం..
Road Accident

Updated on: May 17, 2022 | 4:53 PM

Delhi-Jaipur Highway Accident: హర్యానాలోని రేవరిలో ఘరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీ-జైపూర్ హైవేపై మంగళవారం వేగంగా వచ్చిన క్రూజర్.. ఆగి ఉన్న ట్రక్కును ఢీకొనడంతో ఐదుగురు దుర్మరణం చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారని, వారందరూ ఒకే కుటుంబానికి చెందిన వారని బావల్ కలెక్టర్ సంజీవ్ కుమార్ తెలిపారు. జైపూర్‌ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి మరణించడంతో.. అతని అస్థికలను గంగా నదిలో కలిపేందుకు హరిద్వార్ వెళ్లారు. అక్కడి నుంచి జైపూర్ వెళ్తుంగా.. రేవరిలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

క్రూజర్‌లో 17 మంది ప్రయాణిస్తున్నారు. తాతగారి చితాభస్మాన్ని గంగానదిలో కలిపి వస్తుండగా.. ప్రమాదం జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి