Earthquake: లడఖ్‌లో మరోసారి భూకంపం.. 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు

లడఖ్‌లో మరోసారి భూకంపం సంభవించింది. గురువారం ఉదయం స్వల్ప భూప్రకంపనలు చెలరేగాయి. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5.53గా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి వివరాలు ఏమీ ఇప్పటివరకు బయటకు రాలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Earthquake: లడఖ్‌లో మరోసారి భూకంపం.. 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు
Earthquake Ladakh

Updated on: Aug 13, 2026 | 9:50 AM

గురువారం తెల్లవారుజామున లడఖ్‌లోని లేహ్‌లో భూప్రకంపనలు చెలరేగాయి. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5.53గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. గురువారం ఉదయం సుమారు 6:05 గంటల సమయంలో భూకంపం సంభవించినట్లు తెలుస్తోండగా..  భూ ఉపరితలం నుండి 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (NCS) వెల్లడించింది. లోతు తక్కువగా ఉండటం వల్ల సమీప ప్రాంతాలలో భూ ప్రకంపనలు సంభవించాయి. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ లేదా ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఏమీ బయటకు రాలేదు. టెక్టోనిక్ ప్లేట్ల నిరంతర కదలిక, పరస్పర చర్యల కారణంగా హిమాలయ ప్రాంతంలో భూకంపాలు అనేది సర్వసాధారణంగా వస్తూ ఉంటాయని అధికారులు చెబుతున్నారు. గతంలోనూ లడఖ్‌లో అనేకసార్లు భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. 

లడఖ్ భూకంప జోన్ IVలో ఉంది. అంటే భూకంపాల ముప్పు ఎక్కువగా పొచి ఉంటుంది. ప్రతి ఏడాది వందలాది సార్లు చిన్న నుండి స్వల్ప తీవ్రత గల భూకంపాలు సంభవిస్తాయి.  రిక్టర్ స్కేల్‌పై 2.0 నుండి 4.5 తీవ్రత మధ్య ఇవి నమోదవుతున్నాయి. వీటిలో చాలా వరకు తేలికపాటి సూక్ష్మ ప్రకంపనలు ఉంటున్నాయి. వీటిని కేవలం భూకంప పరికరాల ద్వారా మాత్రమే గుర్తించవచ్చు. వీటిని తేలికపాటి కుదుపులుగా మాత్రమే చెప్పవచ్చని అధికారులు వెల్లడిస్తున్నాయి. 

Loading...
Unable to load recommendations.
Follow Us