పాకిస్థాన్‌ దాడి.. విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పులు.. ముగ్గురు భారత పౌరులు మృతి

మరోవైపు మే7 బుధవారం రోజున దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లో మాక్ డ్రిల్ నిర్వహణతో పాటు, సరిహద్దుల్లో వాయుసేన భారీ విన్యాసాలు చేపట్టాలంటూ ప్రభుత్వం ఇప్పటికే ఆయా శాఖలను ఆదేశించింది. మరోవైపు పాక్ ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడులు నిర్వహించింది. ఊహించిన ఈ ఘటనతో పాక్‌ ఒక్కసారిగా ఉలిక్కి పడింది.

పాకిస్థాన్‌ దాడి.. విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పులు.. ముగ్గురు భారత పౌరులు మృతి
Operation Sindoor

Updated on: May 07, 2025 | 8:06 AM

పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన సరిగ్గా 15 రోజుల తర్వాత మే7న మంగళవారం రాత్రి 1:44 గంటల ప్రాంతంలో భారతదేశం పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై, పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (POK)పై దాడి చేసింది. ఆపరేషన్‌ సింధూర్‌ పేరుతో భారత్‌ పాక్ కు గట్టి బుద్ధి చెప్పింది. ఊహించని భారత్ దెబ్బతో పాకిస్తాన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆపరేషన్ సింధూర్ కు వ్యతిరకేంగా పాకిస్థాన్ కూడా కవ్వింపు చర్యలకు దిగింది. పాక్ ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట దాడులకు దిగితే, పాకిస్థాన్ మాత్రం నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పాక్ సైన్యం విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతుండటంతో ముగ్గురు భారత పౌరులు మరణించినట్లుగా తెలిసింది.

జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్‌లో జిల్లాలోని LOC వెంట ఉన్న ఉరి సెక్టార్ లో పాక్ ఆర్మీ ఆర్టిలరీ షెల్లింగ్స్ కాల్పులతో దాడికి పాల్పడింది. ఈ దాడిలో ముగ్గురు అమాయకులు చనిపోయారు. పూంచ్ అటవీ శాఖ కార్యాలయం కూడా ధ్వంసమైందని తెలిసింది.. మృతులను షాహీన్ నూర్ కుమారుడు మహ్మద్ ఆదిల్, అల్తాఫ్ హుస్సేన్ కుమారుడు సలీం హుస్సేన్, షాలు సింగ్ భార్య రూబీ కౌర్‌గా గుర్తించారు. కాగా, మరికొంతమంది గాయపడ్డారు. ఇందుకు ఇండియన్ ఆర్మీ కూడా ధీటుగా బదులిస్తుంది.

పహల్‌గామ్ దాడికి ప్రతీకారంగా పాక్‌కు భారత సైన్యం గట్టి బుద్ధి చెప్పింది. అర్థరాత్రి 1.44 గంటలకు పాక్‌లోని 4, పీఓకేలోని 5 ఉగ్ర శిబిరాలపై ఇండియన్ ఆర్మీ దాడులు జరిపింది. మరోవైపు మే7 బుధవారం రోజున దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లో మాక్ డ్రిల్ నిర్వహణతో పాటు, సరిహద్దుల్లో వాయుసేన భారీ విన్యాసాలు చేపట్టాలంటూ ప్రభుత్వం ఇప్పటికే ఆయా శాఖలను ఆదేశించింది. మరోవైపు పాక్ ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడులు నిర్వహించింది. ఊహించిన ఈ ఘటనతో పాక్‌ ఒక్కసారిగా ఉలిక్కి పడింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..