Mushrooms: ‘కొంప’ముంచిన పుట్టగొడుకులు.. ముగ్గురు చిన్నారులు మృతి! మరో 9 మందికి సీరియస్

|

Jun 02, 2024 | 5:53 PM

పుట్టగొడుగులు తిని ఒకే కుంటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. అదే కుటుంబంలోని మరో 9 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరంతా పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ షాకింగ్‌ ఘటన మేఘాలయలోని పశ్చిమ జైంతియా హిల్స్ జిల్లాలో శనివారం (జూన్‌ 1) చోటు చేసుకుంది. డిప్యూటీ కమిషనర్ బీఎస్ సోహ్లియా తెలిపిన వివరాల ప్రకారం..

Mushrooms: కొంపముంచిన పుట్టగొడుకులు.. ముగ్గురు చిన్నారులు మృతి! మరో 9 మందికి సీరియస్
Mushrooms
Follow us on

షిల్లాంగ్, జూన్‌ 2: పుట్టగొడుగులు తిని ఒకే కుంటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. అదే కుటుంబంలోని మరో 9 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరంతా పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ షాకింగ్‌ ఘటన మేఘాలయలోని పశ్చిమ జైంతియా హిల్స్ జిల్లాలో శనివారం (జూన్‌ 1) చోటు చేసుకుంది. డిప్యూటీ కమిషనర్ బీఎస్ సోహ్లియా తెలిపిన వివరాల ప్రకారం..

మేఘాలయలోని పశ్చిమ జైంతియా హిల్స్ జిల్లా సఫాయ్ గ్రామంలోని ఒక కుటుంబానికి చెందిన 12 మంది అడవి పుట్టగొడుగులు తిన్నారు. అనంతరం కాసేపటికే తీవ్ర అశ్వస్తతతో వారిలో ముగ్గురు పిల్లలు చనిపోయారు. అదే కుటుంబంలోని మరో తొమ్మిది మంది తీవ్ర అస్వస్థతకు గురవడంతో వారందరినీ వివిధ ఆస్పత్రులకు తరలించారు.

పుట్టగొడుగులు తిని మరణించిన చిన్నారులను రివాన్సక సుచియాంగ్ (8), కిట్లాంగ్ దుచియాంగ్ (12), వాన్సాలన్ సుచియాంగ్ (15)గా గుర్తించారు. అనారోగ్యానికి గురైన మిగతా కుటుంబ సభ్యులను పలు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని డిప్యూటీ కమిషనర్ బీఎస్ సోహ్లియా మీడియాకు తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.