పేదల ఇళ్లపై కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం… పట్టణాల్లో 3.61 లక్షల గృహాల నిర్మాణానికి కేంద్రం ప్రభుత్వం ఆమోదం

|

Jun 09, 2021 | 3:28 PM

ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై...

పేదల ఇళ్లపై కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం... పట్టణాల్లో 3.61 లక్షల గృహాల నిర్మాణానికి కేంద్రం ప్రభుత్వం ఆమోదం
pm modi video conference with ministers
Follow us on

ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ప్రధానంగా దేశంలో ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్థితులపై చర్చించారు. ఉచిత వ్యాక్సిన్, ఆర్ధిక వ్యవస్థపై కేంద్ర కేబినెట్ నిర్ణయాలు తీసుకుంది. ఇక పట్టణాల్లో 3.61 లక్షల గృహాల నిర్మాణానికి కేంద్రం ప్రభుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపింది. 2021 సంవత్సరానికిగాను 100 రోజుల ఛాలెంజ్‌ పేరుతో రాష్ట్రాలకు పీఎంఏవై-యూ అవార్డులు కేంద్రం ప్రధానం చేయనుంది. ఇప్పటివరకు మంజూరు చేసిన 1.12 కోట్ల గృహాలలో 82.5 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నట్టు తెలిపింది. కాగా కరోనా వైరస్ దేశంలో విజృంభిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేసేందుకు అన్నివిధాలుగా ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా కోవిడ్-19 వ్యాక్సిన్ల సేకరణ, వాటిని రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన విష‌యం తెలిసిందే.  ఈనెల 21వ తేదీ నుంచి అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ దేశవ్యాప్తంగా కేంద్రీకృతంగా సాగుతుందని తెలిపారు. వ్యాక్సిన్‌ ప్రక్రియలో గత నెలలో చేసిన సవరణలకు స్వస్తి పలుకుతున్నామని చెప్పారు. ఆ మేరకు దేశవ్యాప్తంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కేబినెట్‌ నిర్ణయించింది.

Also Read: ప్రైవేట్ ఆస్పత్రులకు రూ.11.30 కోట్లు ఫైన్ వేసిన ఏపీ స‌ర్కార్

సాధారణ మరణానికి రూ.లక్ష.. ప్రమాదంలో చనిపోతే రూ.5 లక్షలు సాయం!