Chicken Food Festival: చికెన్‌ ప్రియులకు బంపరాఫర్.. తిన్నోళ్లకు తిన్నంత! ఎక్కడంటే..

|

Jun 09, 2024 | 4:03 PM

భోజన ప్రియులు నాన్‌ వెజ్‌ వంటకాలు ఎక్కడ కనిపించినా లొట్టలేసుకుంటూ తినేస్తుంటారు. చికెన్‌ కబాబ్, చికెన్‌ మంజూరియా, చికెన్‌ 65, చికెన్‌ బిర్యానీ, చిల్లీ చికెన్‌.. ఇలా కోడి రకాన్ని చూసుకుని మరీ వెరైటీలు వండి వాడ్చే హోటళ్లు కూడా ఉన్నాయి. ఇక ఆరోగ్యంపై కాస్త అవగాహన ఉన్నవారికోసం తక్కువ కారంగా ఉండే రుచికరమైన చికెన్ వంటకాలను అందించే హోటళ్లూ ఉన్నాయి. అయితే అన్ని రకాల చికెన్‌ స్పెషల్స్‌ ఒకే చోట దొరికితే..

Chicken Food Festival: చికెన్‌ ప్రియులకు బంపరాఫర్.. తిన్నోళ్లకు తిన్నంత! ఎక్కడంటే..
2nd Chicken Food Festival
Follow us on

భోజన ప్రియులు నాన్‌ వెజ్‌ వంటకాలు ఎక్కడ కనిపించినా లొట్టలేసుకుంటూ తినేస్తుంటారు. చికెన్‌ కబాబ్, చికెన్‌ మంజూరియా, చికెన్‌ 65, చికెన్‌ బిర్యానీ, చిల్లీ చికెన్‌.. ఇలా కోడి రకాన్ని చూసుకుని మరీ వెరైటీలు వండి వాడ్చే హోటళ్లు కూడా ఉన్నాయి. ఇక ఆరోగ్యంపై కాస్త అవగాహన ఉన్నవారికోసం తక్కువ కారంగా ఉండే రుచికరమైన చికెన్ వంటకాలను అందించే హోటళ్లూ ఉన్నాయి. అయితే అన్ని రకాల చికెన్‌ స్పెషల్స్‌ ఒకే చోట దొరికితే.. ఇకేం పండగే. అలాంటి వారి కోసం అగర్తలాలో జరిగే చికెన్ ఫుడ్ ఫెస్టివల్ స్పెషల్ ఆహ్వానం పలుకుతోంది. అగర్తల క్లబ్ ద్వారా నిర్వహించే ఈ ఫెస్టివల్‌ను గడేడాది తొలిసారిగా నిర్వహించారు. ఈ ఏడాది రెండో సారి ఆ రుచులను అందించడానికి సిద్ధమైంది. త్రిపుర రాజధాని అగర్త వేధికగా 10 రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్‌ను ఒలింపియాడ్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, ఆమె కోచ్ బిశ్వేశ్వర్ నందితో కలిసి నిర్వహిస్తున్నారు.

నోరూరించే దాదాపు 100 రకాల చికెన్ వంటకాలు ఈ ఈవెంట్‌లో అందిస్తారు. ఒక్కో ప్లేట్ ధర కేవలం రూ.199 మాత్రమే. పైనాపిల్, మామిడి, యాపిల్ వంటి పండ్లతో సహా అనేక రకాల సాంప్రదాయేతర పదార్థాలతో కూడిన ఆరోగ్యకరమైన, తక్కువ స్పైసీగా ఉండే హెల్తీ చికెన్ వంటకాలను జన ప్రాచుర్యంలోకి తీసుకురావడమే ఈ ఫెస్టివల్‌ ఉద్దేశ్యం. ఆరోగ్యకరమైన ఆహారం రుచికరంగా, వైవిధ్యంగా ఏ విధంగా అందించాలనే ఆలోచన నుంచి ఈ చికెన్ ఫెస్టివల్‌ ఐడియా ఉద్భవించిందని నిర్వాహకులు అంటున్నారు.

అథ్లెట్ దీపా కర్మాకర్ మాట్లాడుతూ.. తన కెరీర్‌లో భాగంగా క్రమశిక్షణతో కూడిన ఆహార అలవాట్లు పాటిస్తున్నానని, భోజన ప్రియులు అందరూ ఈ ఫెస్టివల్‌కు తప్పనిసరిగా హాజరుకావాలని, ఆరోగ్యకరమైన చికెన్ రుచులను ఆస్వాదించాలని ఆహ్వానం పలుకుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారంతోపాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా సమతుల్య జీవనశైలిని కొనసాగించాలని ప్రజలను ప్రోత్సహిస్తున్నారు. ఈ చికెన్ ఫుడ్ ఫెస్టివల్ ఆరోగ్యం, రుచి.. రెండింటి సమ్మేళనాన్ని అందిస్తుందని, చికెన్ ప్రేమికులందరూ తప్పక సందర్శించాలని దీపా కర్మాకర్‌ ఈ సందర్భంగా ఆహ్వానం పలుకుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.