Covid Vaccine: 50 ఏళ్ల పైబడిన 27 కోట్ల మందికి కరోనా టీకాలు.. త్వరలో ముఖ్యమంత్రులతో సమావేశం కానున్న ప్రధాని మోదీ

|

Feb 12, 2021 | 1:25 PM

Covid Vaccine: దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా టీకాలు వేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు 50 ఏళ్ల పైబడిన వారికి టీకాలు ఇవ్వడం..

Covid Vaccine: 50 ఏళ్ల పైబడిన 27 కోట్ల మందికి కరోనా టీకాలు.. త్వరలో ముఖ్యమంత్రులతో సమావేశం కానున్న ప్రధాని మోదీ
Follow us on

Covid Vaccine: దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా టీకాలు వేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు 50 ఏళ్ల పైబడిన వారికి టీకాలు ఇవ్వడం లేదు. ప్రస్తుతం వారికి కూడా టీకాలు ఇచ్చే అంశంపై ప్రయాత్నాలు కొనసాగుతున్నాయి. 50 ఏళ్ల వయసుపైబడిన 27 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్‌ ఉచితంగా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మార్చి మధ్యలో వీరికి టీకాలు వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ విషయంపై చర్చించేందుకు ప్రధాని నరేంద్రమోదీ ఈ నెలలో ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. వారు ఇచ్చే సూచనలు, సలహాల మేరకు వృద్ధులకు టీకాలు వేయడంపై కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం మేరకు.. 50 ఏళ్లపైబడిన 27 కోట్ల మందికి జూలై నాటికి టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. టీకా కోసం కేంద్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తోందో, రాష్ట్రాలు ఎంత చెల్లించాలి అనే అంశంపై ముఖ్యమంత్రులతో మోదీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

టీకా కొనుగోలు మొత్తం ఖర్చును భరించడానికి కేంద్ర సర్కార్‌ గతంలోనే అంగీకరించిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే రవాణా, నిల్వ ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని కేంద్రం సూచిస్తోంది. ప్రధాని మోదీ సమావేశం తర్వాత కోవిడ్‌-19 కోసం వ్యాక్సిన్‌ అడ్మినిస్ట్రేషన్‌పై జాతీయ నిపుణుల బృందం తుది నిర్ణయం తీసుకుంది. ఇటీవల పార్లమెంట్‌కు సమర్పించిన బడ్జెట్‌లో కేంద్రం టీకాల కోసం కేటాయించిన రూ.35 వేల కోట్ల నుంచి 46 కోట్ల మందికి రెండు మోతాదుల టీకాలు ఉచితంగా ఇవ్వవచ్చని ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది.

Also Read: PM Narendra Modi: 14న చెన్నైలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన