విషాదం.. శ్రామిక్‌ ట్రైన్‌లో ఇద్దరు వలస కార్మికుల మృతి..

| Edited By:

May 28, 2020 | 1:04 PM

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న క్రమంలో.. వలస కార్మికులను స్వస్థలాలకు పంపేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రామిక్‌ ట్రైన్‌లను నడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ ట్రైన్‌ల ద్వారా.. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారిని.. వారి స్వరాష్ట్రాలకు తరలించే కార్యక్రమం కొనసాగుతోంది. ఈ ట్రైన్‌లలో వెళ్తున్న కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. ఆహారం, నీరు అందజేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ముంబై నుంచి యూపీ, బీహార్‌కి బయల్డేరిన ఓ శ్రామిక్‌ ట్రైన్‌లో ఇద్దరు వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. యూపీలోని […]

విషాదం.. శ్రామిక్‌ ట్రైన్‌లో ఇద్దరు వలస కార్మికుల మృతి..
Follow us on

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న క్రమంలో.. వలస కార్మికులను స్వస్థలాలకు పంపేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రామిక్‌ ట్రైన్‌లను నడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ ట్రైన్‌ల ద్వారా.. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారిని.. వారి స్వరాష్ట్రాలకు తరలించే కార్యక్రమం కొనసాగుతోంది. ఈ ట్రైన్‌లలో వెళ్తున్న కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. ఆహారం, నీరు అందజేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ముంబై నుంచి యూపీ, బీహార్‌కి బయల్డేరిన ఓ శ్రామిక్‌ ట్రైన్‌లో ఇద్దరు వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. యూపీలోని మందువాదీ రైల్వే స్టేషన్‌లో అధికారులు ఇద్దరు వలస కార్మికుల డెడ్‌ బాడీస్‌ను గుర్తించారు. వీరిలో ఒకరు కుటుంబంతో ప్రయాణిస్తుండగా.. అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోయారని.. మరొక కార్మికుడి మరణం గుర్తించి దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారు.
కాగా, ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు, విద్యార్ధులు, ఇతర పనులపై వెళ్లి చిక్కుకుపోయిన వారంతా.. దాదాపు వెయ్యికిపైగా రైళ్లలో యూపీకి చేరుకుంటున్నారని అధికారులు పేర్కొన్నారు.