Manipur Violence: మణిపుర్‌లో మళ్లీ చెలరేగిన ఘర్షణలు.. అక్కడికి వెళ్లనున్న ‘ఇండియా’ కూటమి ఎంపీలు

|

Jul 29, 2023 | 8:43 AM

మణిపుర్‌ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఇటీవల ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించడంతో ఈ వివాదం మరింత రాజుకుంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో కూడా మణిపుర్ అంశమే కీలకంగా మారింది. ప్రధాని మోదీ మణిపుర్‌ సమస్యపై మట్లాడాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

Manipur Violence: మణిపుర్‌లో మళ్లీ చెలరేగిన ఘర్షణలు.. అక్కడికి వెళ్లనున్న ఇండియా కూటమి ఎంపీలు
Manipur Violence
Follow us on

మణిపుర్‌ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఇటీవల ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించడంతో ఈ వివాదం మరింత రాజుకుంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో కూడా మణిపుర్ అంశమే కీలకంగా మారింది. ప్రధాని మోదీ మణిపుర్‌ సమస్యపై మట్లాడాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇందుకోసం అవిశ్వాస తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టాయి. అయితే శుక్రవారం రాత్రి మళ్లీ మణిపుర్‌లో ఘర్షణలు చెలరేగాయి. బిష్ణుపూర్‌లోని కొంతమంది దుండగులు వివిధ చోట్ల కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనల్లో ఇద్దరు పౌరులు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు దుండగులు ఆరు ఇళ్లను కూడా తగలబెట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, కేంద్ర బలగాలు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

ఇదిలా ఉండగా ఈరోజు ఇండియా కూటమి ఎంపీల బృందం మణిపుర్‌లో పర్యటించనున్నారు. అక్కడి పరిస్థితిని అంచనా వేయడానికి పార్లమెంట్ ఉభయ సభల నుంచి 16 పార్టీలకు చెందిన 20 మంది ఎంపీలు వెళ్లనున్నారు. గత కొన్నిరోజులుగా అక్కడ జరుగుతున్న హింసాత్మక ఘటనల వల్ల దెబ్బతిన్న కొండ ప్రాంతాలు, లోయ ప్రాంతాలు, సహాయక కేంద్రాలను సందర్శించనున్న ఈ ఇండియా కూటమి.. అక్కడి బాధితులు పరిస్థితి గురించి తెలుసుకోనుంది. అలాగే ఆదివారం ఉదయం మణిపుర్ గవర్నర్‌ను కూడా కలిసేందుకు తమకు సమయం ఇవ్వాలని కోరింది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం మణిపుర్ అంశంపై పార్లమెంట్‌లో చర్చించేందుకు అనుమతి లేనందువల్ల అక్కడి పరిస్థితులు ప్రెస్ మీట్‌లో తెలియజేస్తామని తెలిపింది. ఇదిలా ఉండగా మణిపుర్ పర్యటనకు వెళ్తున్న ఎంపీలలో అధిర్ రంజన్ చౌదరి, గౌరవ్ గొగోయ్, రాజీవ్ రంజన్ లాలన్ సింగ్, శ్రీమతి సుస్మితా దేవ్, శ్రీమతి కనిమొళి కరుణానిధి, సంతోష్ కుమార్, AA రహీమ్, ప్రొఫెసర్ మనోజ్ కుమార్ ఝా, జావేద్ అలీ ఖాన్ , మహువా మాజి, PP మహమ్మద్ ఫైజల్, అనీల్ ప్రసాద్ హెగ్డే, ET మహమ్మద్ బషీర్, NK ప్రేమచంద్రన్, సుశీల్ గుప్తా, అరవింద్ సావంత్, D రవికుమార్, తిరు తోల్ తిరుమావళవన్, జయంత్ సింగ్ , ఫూలో దేవి నేతమ్ ఉన్నారు.