అరె ఏంట్రా ఇలా ఉన్నారు.. జుట్టు కట్ చేసుకోమన్నందుకు ఏకంగా ప్రిన్సిపాల్‌నే..

విద్యార్థులను టీచర్లు ఏమనలేని పరిస్థితులు రావడం ఆందోళన కలిగిస్తున్నాయి. హెయిర్ కట్ చేయించుకుని నీట్‌గా ఉండాలని విద్యార్థులను హెచ్చరించడమే ప్రిన్సిపాల్ తప్పు అయ్యింది. ఎందుకంటే ప్రన్సిపాల్ చెప్పింది విద్యార్థులకు నచ్చకపోగా కోపం తెప్పించింది. ఈ కోపంలో వారు కఠిన నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులు చేసిన పనితో అంతా షాకయ్యారు. ప్రస్తుతం పోలీసులు వారి కోసం వెతుకుతున్నారు.

అరె ఏంట్రా ఇలా ఉన్నారు.. జుట్టు కట్ చేసుకోమన్నందుకు ఏకంగా ప్రిన్సిపాల్‌నే..
Haryana Students

Updated on: Jul 10, 2025 | 5:29 PM

విద్యార్థులకు ఏం చెప్పాలన్నా టీచర్లు భయపడే పరిస్థితులు వస్తున్నాయి. చదువుకోవాల్సిన విద్యార్థులు నేరాలకు పాల్పడడం ఆందోళన కలిగిస్తుంది. టీచర్లు తిట్టినా, కొట్టినా, మంచిగా చదవుకోమని మందలించినా విద్యార్థులకు నచ్చడం లేదు. అలా చెప్తే ఇంకా మొండిగా తయారవుతున్నారు. తల్లిదండ్రులతో టీచర్లనే తిట్టించడంతో పాటు వారే కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా హర్యానాలో దారుణం చోటుచేసుకుంది. హెయిర్ కట్ చేసుకుని, నీట్‌గా, క్రమశిక్షణతో ఉండాలని చెప్పడమే ఓ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రాణాల మీదికి తెచ్చింది. అలా చెప్పినందుకు ఆ ప్రిన్సిపాల్ ప్రాణాలే తీశారు విద్యార్థులు. హిసార్‌లోని బాద్షాపూర్ గ్రామంలో కర్తార్ మెమోరియల్ స్కూల్ ఉంది. జగ్బీర్ సింగ్ ఈ స్కూల్ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. ఇవాళ ఉదయం 10.30 గంటల సమయంలో ఆయన దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

12వ తరగతికి చెందిన ఇద్దరు విద్యార్థులను ప్రిన్సిపాల్ మందలించారు. హెయిర్ కట్ చేయించుకోవాలని, క్రమశిక్షణ పాటించాలని కోరారు. స్కూల్ రూల్స్ తప్పక పాటించాలని హెచ్చరించారు. ఎన్నిసార్లు హెచ్చరించినా ఆ విద్యార్థుల తీరు మారలేదు. అంతేకాకుండా ప్రిన్సిపాల్ పదే పదే తిట్టడం వారికి కోపం తెప్పించింది. ఈ క్రమంలో ఇవాళ ఉదయం వారి వెంట తెచ్చుకున్న కత్తితో ప్రిన్సిపాల్‌ను విద్యార్థులు పొడిచి చంపారు. దీంతో రక్తపు మడుగులో జగ్బీర్ సింగ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఇతర విద్యార్థులు, సిబ్బంది ఆయన్ని వెంటనే ఆస్పత్రికి తరలించినా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విద్యార్థులు పరిగెత్తుకుంటూ కత్తి బయకు విసిరేయడం సీసీటీవీలో రికార్డు అయ్యింది. ప్రస్తుతం విద్యార్థుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..