Table Tennis Player Vishwa Deenadayalan Dies: తమిళనాడుకు చెందిన 18 ఏళ్ల టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు విశ్వ దీనదయాళన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గౌహతి నుంచి షిల్లాంగ్ వెళ్తుండగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో టాప్ టెన్నిస్ ప్లేయర్ విశ్వ దీన్‌దయాలన్ మరణించినట్లు టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (TTFI) ఒక ప్రకటనలో తెలిపింది. నేటినుంచి (సోమవారం) ప్రారంభం కానున్న 83వ సీనియర్ జాతీయ, అంతర్రాష్ట్ర టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌ల కోసం విశ్వ మరో ముగ్గురు ఆటగాళ్లతో కలిసి గౌహతి నుంచి షిల్లాంగ్‌కు ఆదివారం సాయంత్ర కారులో బయలుదేరాడు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారును ఎన్‌హెచ్-6పై షాన్‌బంగ్లా వద్ద ట్రక్కు ఢీ కొట్టింది. దీంతో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు.
విశ్వతోపాటు మరో ముగ్గురు ఆటగాళ్లు రమేశ్ సంతోష్ కుమార్, అవినాశ్ శ్రీనివాసన్, కిశోర్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే విశ్వ మరణించినట్లు వైద్యులు తెలిపారని పేర్కొన్నారు. మిగిలిన ముగ్గురు చికిత్స అందుతుందని, వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. కాగా.. విశ్వ మృతిపట్ల మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.
విశ్వ.. టేబుల్ టెన్నిస్‌లో అనేక జాతీయ ర్యాంకింగ్ టైటిళ్లు, అంతర్జాతీయ పతకాలు సాధించాడు. కాగా. ఏప్రిల్ 27 నుండి ఆస్ట్రియాలోని లింజ్‌లో జరిగే WTT యూత్ టోర్నీలో విశ్వ భారత్ తరుపున ప్రాతినిధ్యం వహించాల్సి ఉంది. అన్నానగర్‌లోని కృష్ణస్వామి TT క్లబ్‌లో శిక్షణ పొందిన విశ్వ.. పిన్న వయస్సులోనే అంతర్జాతీయ ఆటగాడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు.
Also Read: